Share News

ఉద్యోగులు, పెన్షనర్లకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్

ABN , Publish Date - Jul 30 , 2026 | 07:27 PM

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఇచ్చిన హామీ మేరకు గత 100 రోజుల్లో రూ.6,000 కోట్ల బకాయిలను చెల్లించిన ప్రభుత్వం.. గురువారం మరో రూ.2,000 కోట్లను విడుదల చేసింది.

ఉద్యోగులు, పెన్షనర్లకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్
Telangana Government

హైదరాబాద్: ఉద్యోగులకు ఇచ్చిన హామీని తెలంగాణ ప్రభుత్వం అమలు చేసింది. గత 100 రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు సంబంధించిన రూ.6,000 కోట్ల బకాయిల చెల్లింపులను పూర్తి చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. గురువారం మరో రూ.2,000 కోట్లను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మంత్రి భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఈ నిధులను విడుదల చేసినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు.


ప్రభుత్వం మూడు విడతల్లో ఒక్కోసారి రూ.2,000 కోట్ల చొప్పున మొత్తం రూ.6,000 కోట్లను విడుదల చేసింది. దీంతో పెండింగ్‌లో ఉన్న విశ్రాంత ఉద్యోగుల కమ్యూటేషన్ బకాయిలను పూర్తిగా చెల్లించినట్లు అధికారులు తెలిపారు. ఇంకా మిగిలి ఉన్న ఇతర బకాయిలను కూడా దశలవారీగా విడుదల చేస్తామని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగులు, పెన్షనర్ల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొంది. ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగులు, పెన్షనర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Also Read:

వర్షాకాలంలో ప్రయాణం.. ఈ జాగ్రత్తలు తీసుకోండి

ఇంట్లో గులాబీ మొక్క పెంచుతున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Updated Date - Jul 30 , 2026 | 07:51 PM