Share News

ఉదయ్ కృష్ణారెడ్డి రిమాండ్ రిపోర్టులో వెలుగులోకి కీలక అంశాలు

ABN , Publish Date - Jul 30 , 2026 | 12:49 PM

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.మహిళా ట్రైనీ ఐపీఎస్‌పై లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన కృష్ణారెడ్డి ప్రస్తుతం చంచల్‌గూడా జైల్లో ఉన్నాడు.

ఉదయ్ కృష్ణారెడ్డి రిమాండ్ రిపోర్టులో వెలుగులోకి కీలక అంశాలు
Uday Krishna Reddy Case

హైదరాబాద్, జులై 30 (ఆంధ్రజ్యోతి): ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి (Uday Krishna Reddy Case) రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. మహిళా ట్రైనీ ఐపీఎస్‌పై లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన కృష్ణారెడ్డి ప్రస్తుతం చంచల్‌గూడా జైల్లో ఉన్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ముందుగా ఇద్దరికీ పరిచయం ఏర్పడిందని.. ఆ తర్వాత జాతీయ పోలీస్ అకాడమీలో వారు దగ్గరయ్యారని పోలీసులు తెలిపారు. ఉదయ్ జీవిత చరిత్ర చూసి ట్రైనీ ఐపీఎస్ అధికారిని పరిచయం పెంచుకున్నారని వెల్లడించారు.


ఐపీఎస్ అధికారినిపై ఉదయ్ కృష్ణారెడ్డి దాడి చేశాడు..

మహిళా ట్రైనీ ఐపీఎస్‌, ఉదయ్ కృష్ణారెడ్డి మధ్య చాలాకాలం పాటు సంబంధాలు కొనసాగాయని పోలీసులు రిమాండ్ రిపోర్టులో చెప్పుకొచ్చారు. కొన్ని రోజుల తర్వాత వీరి మధ్య విభేదాలు వచ్చాయని తెలిపారు. ఇతరులతో మాట్లాడితే లేడీ అధికారిని ఉదయ్ విపరీతంగా వేధించేవారని అన్నారు. కొన్ని సందర్భాల్లో ట్రైనీ ఐపీఎస్ అధికారినిపై దాడి చేసిన సంఘటనలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. జాతీయ పోలీస్ అకాడమీలో వీరు విడిపోయారని వెల్లడించారు. ముస్సోరీలో జరిగిన ట్రైనింగ్‌లో మళ్లీ మహిళా ట్రైనీ ఐపీఎస్‌, ఉదయ్ కృష్ణారెడ్డి కలుసుకున్నారని పోలీసులు తెలిపారు.


అనుమానంతో వేధించేవాడు..

అప్పటినుంచి వీరి మధ్య సంబంధాలు కొనసాగాయని పోలీసులు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. కొద్దిరోజులు బాగానే ఉన్నా తర్వాత మహిళా ట్రైనీ ఐపీఎస్‌‌ను ఉదయ్ కృష్ణారెడ్డి తరచూ అనుమానంతో వేధించేవాడని చెప్పారు. ఉదయ్ కృష్ణారెడ్డి తీరుతో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయని వెల్లడించారు. మళ్లీ ఎమోషనల్‌గా ఆమెకు దగ్గరయ్యారని అన్నారు. ఐదుసార్లు మహిళా ట్రైనీ ఐపీఎస్‌‌ను కొట్టాడని పోలీసులు చెప్పారు. ఆ తర్వాత కూడా అతని తీరు మారలేదని.. అనంతరం వారిద్దరి మధ్య మళ్లీ విభేదాలు వచ్చాయని తెలిపారు. నేషనల్ పోలీస్ అకాడమీలో అధికారులకు ఇంటర్నల్‌గా మహిళా ట్రైనీ ఐపీఎస్‌‌ ఫిర్యాదు చేశారని పోలీసులు వెల్లడించారు.


మరికొంత మంది అమ్మాయిలతో ఉదయ్ కృష్ణారెడ్డి చాటింగ్..

మహిళా ట్రైనీ ఐపీఎస్‌కు మే నెలలో వివాహం జరిగిందని పోలీసులు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. ఆ వివాహం తర్వాత ఉదయ్ కృష్ణారెడ్డి నుంచి మరింతగా ఆమెకు వేధింపులు పెరిగాయని చెప్పుకొచ్చారు. దీంతో మహిళా ట్రైనీ ఐపీఎస్‌ తన భర్త సహకారంతో హైదరాబాద్ అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈ క్రమంలోనే మరికొంత మంది అమ్మాయిలతో ఉదయ్ కృష్ణారెడ్డి చాటింగ్ చేసినట్లుగా గుర్తించామని చెప్పారు. చాలామంది యువతులను ఉదయ్ వేధించారని పోలీసులు తెలిపారు. హైదరాబాద్‌తోపాటు తన స్వగ్రామంలో కూడా కొంతమంది అమ్మాయిలను ఉదయ్ వేధించారని వెల్లడించారు. పోలీస్ అకాడమీలో ఉన్న ట్రైనింగ్‌లో మహిళా ఐపీఎస్ అధికారులను కూడా ఉదయ్ కృష్ణారెడ్డి వేధించారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.


వార్తలు కూడా చదవండి...

‘సర్’ ప్రక్రియను వేగవంతం చేయాలి: భట్టి విక్రమార్క

హైడ్రాపై మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు

భాగ్యనగరంలో భారీ వర్షాలు.. ట్రాఫిక్ పోలీసుల కీలక సూచనలు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jul 30 , 2026 | 03:11 PM