Share News

హెచ్‌ఎస్ఎల్ మరో ఘనత.. నౌకాదళంలోకి అత్యాధునిక ఐఎన్ఎస్ నిపుణ్

ABN , Publish Date - Jul 30 , 2026 | 09:33 PM

నగరంలోని హిందూస్థాన్ షిప్‌యార్డ్ మరో ప్రతిష్ఠాత్మక విజయాన్ని నమోదు చేసుకుంది. నౌకాదళానికి అత్యాధునిక 'INS నిపుణ్' నౌకను హిందూస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ (HSL) అందజేసింది.

హెచ్‌ఎస్ఎల్ మరో ఘనత.. నౌకాదళంలోకి అత్యాధునిక ఐఎన్ఎస్ నిపుణ్

విశాఖపట్నం, జులై 30: నగరంలోని హిందూస్థాన్ షిప్‌యార్డ్ మరో ప్రతిష్ఠాత్మక విజయాన్ని నమోదు చేసుకుంది. నౌకాదళానికి అత్యాధునిక 'INS నిపుణ్' నౌకను హిందూస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ (HSL) అందజేసింది. దీంతో సముద్రగర్భ వ్యూహాత్మక సామర్థ్యానికి మరింత బలం పెరగనుంది. ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్య సాధనలో మరో చారిత్రక మైలురాయిని చేరుకుంది.హెచ్ఎస్ఎల్ నిర్మించిన డైవింగ్ సపోర్ట్ వెస్సెల్ ఇది. ఈ నౌకను ఇండియన్ రిజిస్టర్ ఆఫ్ షిప్పింగ్ వర్గీకరణ నిబంధనలకు అనుగుణంగా రూపొందించి నిర్మించింది.

HSL.jpg


నిపుణ్ అనేది సంస్కృత పదం. ఓ నిర్దిష్ట రంగంలో నిపుణులు, సమర్థుడు, బాగా ప్రావీణ్యం కలవాడు అని అర్థం. ఈ పేరుకు తగినట్లు అత్యంత ప్రత్యేకతలు.. ఈ నౌక సొంతం. లోతైన సముద్రంలో డైవ్ కార్యకలాపాలు, రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టగల సామర్థ్యాన్ని ఐఎన్ఎస్ నిపుణ్ కలిగి ఉంది.

HSL-2.jpg


ఈ నౌకలో అత్యాధునిక డైవ్ పరికరాలను ఏర్పాటు చేశారు. ఇది డీప్ సీ శాచురేషన్ డైవింగ్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. అందుకోసం ఓ వైపు డైవింగ్ స్టేజ్‌ను ఏర్పాటు చేశారు. అలాగే జలాంతర్గామిలో అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు సిబ్బందిని తరలించడానికి, ఈ నౌక డీప్ సబ్‌మెర్జెన్స్ రెస్క్యూ వెస్సెల్ (డీఎస్ఆర్‌వీ)కు మదర్ షిప్‌గా కూడా పని చేస్తుంది. దాదాపు 75 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో దీనిని రూపొందించారు. స్వదేశీ నౌకా నిర్మాణ దిశగా భారత నౌకాదళం సాగిస్తున్న ప్రయాణంలో ఐఎన్ఎస్ నిపుణ్‌ను నౌకాదళానికి అప్పగించడం మరో మైలురాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

పరామర్శ పేరుతో గొడ్డలి పార్టీ డైవర్షన్ పాలిటిక్స్: హోం మంత్రి అనిత

ఆ కసితోనే జిల్లాలను అభివృద్ధి చేస్తున్నాం: మంత్రి నారా లోకేశ్

For More AP News And Telugu News

Updated Date - Jul 30 , 2026 | 10:03 PM