పరామర్శ పేరుతో గొడ్డలి పార్టీ డైవర్షన్ పాలిటిక్స్: హోం మంత్రి అనిత
ABN , Publish Date - Jul 30 , 2026 | 07:53 PM
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు పరామర్శ పేరుతో గొడ్డలి పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ఏపీ హోంమంత్రి అనిత మండిపడ్డారు. గురువారం రాజధాని అమరావతిలో ఆమె మాట్లాడుతూ.. పరామర్శ పేరుతో గొడ్డలి పార్టీ డ్రామాలు ఆడుతోందని విమర్శించారు.
అమరావతి, జులై 30: మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు పరామర్శ పేరుతో గొడ్డలి పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ఏపీ హోంమంత్రి అనిత మండిపడ్డారు. గురువారం రాజధాని అమరావతిలో ఆమె మాట్లాడుతూ.. పరామర్శ పేరుతో గొడ్డలి పార్టీ డ్రామాలు ఆడుతోందని విమర్శించారు. జైలు నిబంధనలు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌రెడ్డికి తెలుసునని పేర్కొన్నారు. కానీ కావాలనే ములాఖత్ సమయం పూర్తయ్యాక జైలు వద్దకు ఆయన వెళ్లారని ఆరోపించారు.
విశాఖపట్నం నుంచి శ్రీకాకుళానికి బల ప్రదర్శన చేసుకుంటూ వైసీపీ అధినేత వెళ్లారని వివరించారు. అయితే జగన్ పర్యటనలో పోలీసులు ఎవరినీ ఇబ్బంది పెట్టలేదని గుర్తు చేశారు. మహిళా ఎస్‌ఐ పట్ల వైసీపీ నేతలు దురుసుగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా ఎస్‌ఐపై దురుసుగా ప్రవర్తించినవారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
అప్పలరాజు కుమారుడు తప్పు చేసినందుకే కేసు పెట్టారని హోం మంత్రి అనిత గుర్తు చేశారు. ఆసుపత్రిలో ఉన్న తన చెల్లిని పరామర్శించడానికి సమయం ఉండదు కానీ.. హిట్ అండ్ రన్ కేసును తారుమారు చేసేందుకు ప్రయత్నించిన మాజీ మంత్రిని పరామర్శించడానికి మాత్రం సమయం ఉంటుందని ఎద్దేవా చేశారు. వక్ర బుద్ధి.. డైవర్షన్ పాలిటిక్స్ చేయడం కోసమే వైఎస్ జగన్ ఇదంతా చేశారని వ్యంగ్యంగా అన్నారు హోం మంత్రి అనిత.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ కసితోనే జిల్లాలను అభివృద్ధి చేస్తున్నాం: మంత్రి నారా లోకేశ్
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: గణేశ్ విగ్రహ తయారీదారులకు సీపీ హెచ్చరిక
For More AP News And Telugu News