Share News

రాజ్యసభ ముందుకు యాంటీ పేపర్ లీక్ బిల్లు

ABN , Publish Date - Jul 30 , 2026 | 02:22 PM

ప్రశ్నపత్రాల లీకేజీలను అరికట్టడం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యాంటీ పేపర్ లీక్ బిల్లు.. నేడు రాజ్యసభకు రానుంది. సుదీర్ఘ చర్చ అనంతరం ఈ బిల్లు ఆమోదం పొందే అవకాశముంది.

రాజ్యసభ ముందుకు యాంటీ పేపర్ లీక్ బిల్లు

ఇంటర్నెట్ డెస్క్: దేశవ్యాప్తంగా అన్ని పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీలకు అడ్డుకట్ట వేసే దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పబ్లిక్ ఎగ్జామినేషన్(ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు-2026పై రాజ్యసభకు రానుంది. ఈ బిల్లును ఇప్పటికే లోక్‌సభ ఆమోదించగా.. నేడు(గురువారం) ఎగువసభలో దీనిపై సుదీర్ఘ చర్చ జరగనుంది.

పరీక్షల నిర్వహణలో పారదర్శకతను పెంపొందించడం, ప్రశ్నపత్రాల లీకేజీలు, మోసపూరిత చర్యలు, ఇతర అక్రమాలకు పాల్పడే వారిపై మరింత కఠిన చర్యలు తీసుకునేలా ఈ బిల్లును రూపొందించారు. ఇటీవలి కాలంలో దేశంలోని పలు పరీక్షల్లో చోటుచేసుకున్న అవకతవకల నేపథ్యంలో పరీక్షా వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసాన్ని నెలకొల్పడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశమని కేంద్రం చెబుతోంది.


ఇవీ చదవండి:

'భయం లేకుండా విధి నిర్వహణ చేయండి.. బాధ్యత నాది'.. CRPF డైరెక్టర్ జనరల్

ఢిల్లీలో ఆప్ కార్యాలయం ముట్టడి.. పంజాబ్ పేపర్ లీక్‌పై బీజేపీ ఆందోళన

Updated Date - Jul 30 , 2026 | 03:11 PM