Share News

నోట్ల కట్టలు తెగితేనే ఓటు !

ABN , Publish Date - Oct 29 , 2026 | 12:42 PM

స్థానిక సంస్థల ఎన్నికలు బాగా ఖరీదయ్యాయి. నామినేషన్‌ దాఖలు చేసిన తేదీ నుంచి పోలింగ్‌ ముగిసి, ఓట్ల ఫలితం వచ్చేవరకు అభ్యర్థుల నుంచి నోట్ల కట్టలు తెగాల్సిందే.

నోట్ల కట్టలు తెగితేనే ఓటు !
Local Election Expenses

  • ఖరీదెక్కిన స్థానిక ఎన్నికలు

ధర్మవరం(అనంతపురం): స్థానిక సంస్థల ఎన్నికలు బాగా ఖరీదయ్యాయి. నామినేషన్‌ దాఖలు చేసిన తేదీ నుంచి పోలింగ్‌ ముగిసి, ఓట్ల ఫలితం వచ్చేవరకు అభ్యర్థుల నుంచి నోట్ల కట్టలు తెగాల్సిందే. భూములు తాకట్టుపెట్టడం, తెలిసిన వారి దగ్గర చేబదులు తీసుకోవడం, కాంట్రాక్టర్ల నుంచి ఒప్పందాలు చేసుకుని పెట్టుబడులు సమకూర్చుకుని స్థానిక సంగ్రామానికి తెర తీయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ఎన్నికల నిబంధనలను పక్కన పెట్టి గెలుపే ధ్యేయంగా ఓట్లకు నోటు పంచకుండా ఎన్నికల పోలింగ్‌ జరగదనేది తేలిపోయింది.


ELEC2.2.jpgకనీసం రూ.500, పోటీ ఉంటే రూ.వెయ్యి పంచాల్సిందేనన్న పరిస్థితి క్షేత్రస్థాయిలో నెలకొంది. మున్సిపల్‌ చైర్మన్‌, కౌన్సిలర్లు మొదలుకుని గ్రామస్థాయిలో సర్పంచ్‌, ఎంపీటీసీ, జడ్పీటీసీలవరకు ఖర్చు తడిసి మోపెడవుతోంది. ప్రచారం ఖర్చు, పోలింగ్‌ ఏజెంట్లు, కౌంటింగ్‌ ఏజెంట్లు, భారీగా వాహనాలు, అద్దె కార్యకర్తలు, జెండాలు, రోజువారీ ప్రచారాలు, బలహీన వర్గాల హామీలకు వేలకు వేలు పంపిణీలతో ఓట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈనేపథ్యంలో ఎన్నికల కమిషన్‌ నిబంధనల మేరకు చెప్పిన లెక్కలకు ఐదారు రెట్లు ఖర్చు పెట్టాల్సి వస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి:

చనిపోయినా ఎంత బుజ్జిగున్నావ్‌ చిట్టితల్లీ

బహిరంగ మార్కెట్‌లోకి పంప్డ్‌ స్టోరేజీ విద్యుత్‌!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 29 , 2026 | 12:42 PM