Share News

అనంతపురం జిల్లాలో టీడీపీ క్లీన్‌స్వీప్.. మూడు జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం

ABN , Publish Date - Oct 29 , 2026 | 11:28 AM

అనంతపురం జిల్లాలో ఏకగ్రీవాలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆధ్వర్యంలో గుంతకల్లులో టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది.

అనంతపురం జిల్లాలో టీడీపీ క్లీన్‌స్వీప్.. మూడు జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం
three zptc seats unopposed in ananthapuram

అనంతపురం, అక్టోబర్ 29: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో అనంతపురం జిల్లాలో ఏకగ్రీవాలు జోరందుకున్నాయి. ఇప్పటికే గుత్తి మున్సిపాలిటీ చైర్మన్ పదవి, 27 వార్డు స్థానాలు ఏకగ్రీవం కాగా.. గుంతకల్లు నియోజకవర్గం కూడా అదే బాట పట్టింది. ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆధ్వర్యంలో.. టీడీపీ గుంతకల్లును క్లీన్‌స్వీప్ చేసింది.


గుంతకల్లు నియోజకవర్గంలోని జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఈ మేరకు గుత్తి, గుంతకల్లు, పామిడి మండలాల్లో జడ్పీటీసీ , ఎంపీటీసీ స్థానాలు వందశాతం కూటమి ఖాతాలో చేరాయి. గుత్తి జడ్పిటీసీ సభ్యురాలిగా నల్లబోతుల స్వాతి, గుంతకల్లు జడ్పీటీసీ సభ్యురాలిగా డి. గీత, పామిడి జడ్పీటీసీ సభ్యుడిగా పల్లె శ్రీనివాసులు ఎన్నికను ధ్రువీకరిస్తూ.. ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జడ్పీ సీఈఓ విజయలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లా పరిషత్ విడిపోయిన తరువాత జరిగిన ఎన్నికల్లో తొలిసారిగా ముగ్గురు జడ్పీటీసీలు ఏకగ్రీవంగా ఎన్నికవడం ఇదే తొలిసారి.


ఇవి కూడా చదవండి...

ఆర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. ఏపీలో రైళ్లు దారి మళ్లింపు, పలు సర్వీసుల రద్దు

ఆర్నబ్ తుఫాన్ నష్టపరిహారంపై చంద్రబాబు కీలక ఆదేశాలు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 29 , 2026 | 11:46 AM