Share News

ఆర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. ఏపీలో రైళ్లు దారి మళ్లింపు, పలు సర్వీసుల రద్దు

ABN , Publish Date - Oct 29 , 2026 | 09:41 AM

ఆర్నబ్ తుఫాన్ కారణంగా ఏపీలో పలు రైళ్లను రైల్వే అధికారులు దారి మళ్లించారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో రైల్వే ట్రాక్‌లపై నీళ్లు చేరడంతో దక్షిణ కోస్తా రైల్వే పరిధిలో నాలుగు రైళ్లు రద్దయ్యాయి.

ఆర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. ఏపీలో రైళ్లు దారి మళ్లింపు, పలు సర్వీసుల రద్దు
Train Diversions

విశాఖపట్నం, అక్టోబర్ 29: ఆర్నబ్ తుఫాన్ ఏపీలో బీభత్సం సృష్టించింది. నిన్న యానాం- నరసాపురం మధ్య పల్లెపాలెం వద్ద తీరం అతి తీవ్ర తుఫాన్ తీరం దాటింది. తుఫాన్ తీరం దాటే సమయంలో దాదాపు 150 కి.మీ వేగంతో పెనుగాలులు వీచాయి. పలు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. ఇక ఆర్నబ్ తుఫాన్ కారణంగా ఏపీలో పలు రైళ్లను రైల్వే అధికారులు దారి మళ్లించారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో రైల్వే ట్రాక్‌లపై నీళ్లు చేరడంతో దక్షిణ కోస్తా రైల్వే పరిధిలో రైళ్లు రద్దయ్యాయి.


దారి మళ్లించిన రైళ్లు ఇవే..

  • తిరుపతి - పూరి, విశాఖ ఎక్స్ప్రెస్, బెంగళూరు - హౌరా, తిరునెల్వేలి- పురూలియా ఎక్స్‌ప్రెస్‌ దారి మళ్లింపు.

  • తిరుపతి-పూరి ఎక్స్‌ప్రెస్ (17480)ను విజయనగరం-సంబల్‌పూర్-ఖుర్దా రోడ్ మార్గంలో మళ్లింపు.

    (ఈ రైలు విజయనగరం-ఖుర్దా రోడ్ మధ్య స్టేషన్లలో ఆగదు)

  • విశాఖ ఎక్స్‌ప్రెస్ (17016) విజయనగరం-సంబల్‌పూర్-భువనేశ్వర్ న్యూ మార్గంలో మళ్లింపు.

    ( విజయనగరం-ఖుర్దా రోడ్ మధ్య స్టేషన్లలో ఆగదు)

  • బెంగళూరు-హౌరా ఎక్స్‌ప్రెస్ (12864) విజయనగరం-తిట్లగఢ్-ఖరగ్‌పూర్ మార్గంలో మళ్లింపు.

    (విజయనగరం-ఖరగ్‌పూర్ మధ్య స్టేషన్లలో ఆగదు)

  • తిరునెల్వేలి-పురూలియా ఎక్స్‌ప్రెస్ (22606) విజయనగరం-తిట్లగఢ్-ఖరగ్‌పూర్ మార్గంలో మళ్లింపు.

    (విజయనగరం-ఖరగ్‌పూర్ మధ్య స్టేషన్లలో ఆగదు)


పలు రైళ్ల రద్దు..

ఆర్నబ్ తుఫాన్ కారణంగా దక్షిణ కోస్తా రైల్వే పరిధిలో రైళ్లు రద్దయ్యాయి. విశాఖపట్నం డివిజన్‌లోని ఇచ్చాపురం – పలాస సెక్షన్ మధ్య ట్రాక్‌పై నీరు చేరడంతో ఈరోజు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.

రద్దైన రైళ్ల వివరాలు

  • ​రైలు నం.58531 బ్రహ్మపూర్ - విశాఖపట్నం ప్యాసింజర్ రద్దు.

  • ​రైలు నం.58532 విశాఖపట్నం - బ్రహ్మపూర్ ప్యాసింజర్ రద్దు.

  • ​రైలు నం.18526 విశాఖపట్నం - బ్రహ్మపూర్ ఎక్స్‌ప్రెస్ రద్దు.

  • ​రైలు నం.18525 బ్రహ్మపూర్ - విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ రద్దు.

  • ​రైలు నం.22820 విశాఖపట్నం - భువనేశ్వర్ న్యూ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రద్దు.


ఇవి కూడా చదవండి...

చర్చల కోసం ఇరాన్ కీలక అధికారికి వాన్స్ లేఖ

తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి గొట్టిపాటి పర్యటన.. విద్యుత్ పునరుద్ధరణకు ఆదేశాలు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 29 , 2026 | 10:01 AM