Share News

పునరుద్ధరణ వేగం పెంచండి

ABN , Publish Date - Oct 29 , 2026 | 06:45 AM

ఆర్నబ్‌ తుఫాను ప్రభావిత గ్రామాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ పనులు వేగవంతం చేయాలని ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అధికారులను ఆదేశించారు.

పునరుద్ధరణ వేగం పెంచండి

సిబ్బంది క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండాలి: పవన్‌

అమరావతి, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): 9.పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ, గ్రామీణ నీటిసరఫరా విభాగం అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులు పరిస్థితిని వివరించారు. ‘రాష్ట్రవ్యాప్తంగా 75 మండలాల పరిధిలోని 852 గ్రామ పంచాయతీలు తుఫాను ప్రభావానికి గురయ్యాయి. గ్రామీణ రహదారులపై 776 చెట్లు నేలకొరిగాయి. తుఫాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీల పరిధిలో 566 వీఽధి దీపాలు దెబ్బతినగా, ఇప్పటి వరకు 147 పునరుద్ధరించాం. అర్బన్‌ ప్రభావిత జిల్లాల్లో 15,686 మంది పారిశుధ్య సిబ్బందిని క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంచాం. పారిశుధ్య చర్యల కోసం 1017 టన్నుల బ్లీచింగ్‌, 2840 టన్నుల సున్నం, 40,241 లీటర్ల క్లోరిన్‌ అందుబాటులో ఉంచాం’ అని తెలిపారు.

గ్రామ పంచాయతీల్లో పరిస్థితులు పూర్తిగా సాధారణ స్థితికి వచ్చే వరకు అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని, పునరుద్ధరణ పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు నివేదికలు అందించాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. ‘రహదారులపై చెట్లను వెంటనే తొలగించాలి. డ్రెయిన్లలో ప్రవాహాలకు అడ్డంకులు లేకుండా చూడాలి. లోతట్టు ప్రాంతాల నుంచి నీరు తక్షణం బయటకు వెళ్లేలా డ్రెయినేజీ వ్యవస్థను పునరుద్ధరించాలి. అంటువ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు చేపట్టాలి. గ్రామాల్లో విద్యుత్‌ సరఫరా, వీధిదీపాల పునరుద్ధరణకు ప్రాధాన్యం ఇవ్వాలి. తాగునీటి వనరులు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పంపుసెట్లు, ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌లు, పైపులైన్లు దెబ్బతిని ఉంటే వెంటనే పునరుద్ధరించాలని అవసరమైన ప్రాంతాల్లో ట్యాంకర్లతో తాగునీటి సరఫరా చేయాలి. నీటి నాణ్యతను నిరంతరం పరిశీలించాలి’ అని ఆదేశించారు.

ఈ వార్తలనూ చదవండి:

పోటాపోటీ

ఆర్నబ్ తుఫాన్ బాధితులకు సీఎం చంద్రబాబు భారీ ఊరట

Updated Date - Oct 29 , 2026 | 06:45 AM