Share News

చర్చల కోసం ఇరాన్ కీలక అధికారికి వాన్స్ లేఖ

ABN , Publish Date - Oct 29 , 2026 | 07:12 AM

ఇరాన్‌తో శాంతి చర్చలు ప్రారంభించేందుకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ చొరవ తీసుకున్నారని వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. ఇరాన్‌ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి, గతంలో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌ (ఐఆర్‌జీసీ) కమాండర్‌గా పనిచేసిన మొహసెన్ రెజాయీకి వాన్స్‌ ఈ మేరకు లేఖ రాశారని ఆ పత్రిక తెలిపింది.

చర్చల కోసం ఇరాన్ కీలక అధికారికి వాన్స్ లేఖ

ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్‌తో శాంతి చర్చలు ప్రారంభించేందుకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ చొరవ తీసుకున్నారని వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. ఇరాన్‌ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి, గతంలో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌ (ఐఆర్‌జీసీ) కమాండర్‌గా పనిచేసిన మొహసెన్ రెజాయీకి వాన్స్‌ ఈ మేరకు లేఖ రాశారని ఆ పత్రిక తెలిపింది. చర్చలకు సంబంధించిన ఒప్పందానికి అమెరికా, ఇరాన్ అంగీకరించే అవకాశం ఉందా అనే విషయాన్ని తెలుసుకునేందుకు ఆయన ఆ లేఖ రాశారని పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకే వాన్స్‌ ఆ లేఖ రాశారని, ఈ విషయం ట్రంప్‌కూ తెలుసని ఓ అధికారి చెప్పినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది.


అయితే, ఇరాన్‌తో శాంతి చర్చలు ప్రారంభించాలని వాన్స్‌కు తాను ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని ట్రంప్ స్పష్టం చేశారు. జాయింట్ బేస్ ఆండ్రూస్‌లో మీడియాతో ట్రంప్ మాట్లాడారు. ఇరాన్‌కు ప్రస్తుతం వైద్య సామగ్రి అవసరమని, అనారోగ్యంతో ఉన్నవారికి సాయం చేసేందుకు అవసరమైన సామగ్రి సరఫరా చేయడంపై వాన్స్‌ సంప్రదింపులు జరిపారని ఆయన పేర్కొన్నారు. కాగా.. రాబోయే వారాల్లో ఇరాన్‌పై మళ్లీ సైనిక దాడులు జరిపే అవకాశం ఉందని ట్రంప్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో దౌత్య చర్చల ద్వారా మరోసారి యుద్ధం జరగకుండా చూడాలని అమెరికా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పటివరకూ శాంతి ఒప్పందానికి సంబంధించి స్పష్టమైన ప్రతిపాదన ఏదీ రాలేదు. మరోవైపు తమ ప్రధాన డిమాండ్లు నెరవేరే వరకూ అమెరికాతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని రెజాయీ గత వారం స్పష్టం చేశారు.


ఈ వార్తలూ చదవండి

రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య అతి త్వరలో శాంతి చర్చలు.. ట్రంప్ వ్యాఖ్యలు

దాడులు ఆపితే బిలియన్‌ డాలర్లు ఇస్తాం

Updated Date - Oct 29 , 2026 | 08:02 AM