ఎవరికీ మెజారిటీ ఇవ్వని ఇజ్రాయెలీలు!
ABN , Publish Date - Oct 29 , 2026 | 06:42 AM
ఇజ్రాయెల్ పార్లమెంటు ఎన్నికల్లో మరోసారి హంగ్ ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి.
పార్లమెంటు ఎన్నికల్లో నెతన్యాహూ కూటమి
ముందంజలో ఉన్నా దక్కని మెజారిటీ
ఆయన కూటమి 53, ప్రతిపక్షం 48 సీట్లలో ఆధిక్యం
19 సీట్లతో కింగ్‌మేకర్స్‌గా మారనున్న అరబ్ పార్టీలు
కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు..
అరబ్ పార్టీలతో పొత్తుండద న్న బీబీ
ఎవరికీ మెజారిటీ ఇవ్వని ఇజ్రాయెలీలు!
53 సీట్లతో ముందంజలో నెతన్యాహూ కూటమి
జెరూసలేం, అక్టోబరు 28: ఇజ్రాయెల్ పార్లమెంటు ఎన్నికల్లో మరోసారి హంగ్ ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. 120 సీట్లున్న పార్లమెంటు నెసెట్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు 61సీట్లు అవసరం కాగా..ఏ పార్టీ కూడా మ్యాజిక్ మార్క్‌కు దగ్గరగా రాలేకపోయింది. ప్రధాని నెతన్యాహు(బీబీ) నేతృత్వంలోని లికుడ్ పార్టీ కూటమి 53సీట్లతో ఆధిపత్యం చూపుతున్నప్పటికీ సంపూర్ణ మెజారిటీ సాధించే అవకాశం లేదని ఆ దేశ మీడియా తెలిపింది. మాజీ సైన్యాధ్యక్షుడు గాడి ఐసెన్‌కోట్ నేతృత్వంలోని ప్రతిపక్ష యాషర్ కూటమి 48 స్థానాల్లో గెలుపు దిశగా వెళ్తోంది. అరబ్ పార్టీల కూటమి ది జాయింట్ లిస్ట్ 19 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. పోలైన ఓట్లలో 87 శాతం ఓట్ల లెక్కింపు ఆధారంగా ఎన్నికల సంఘం ఈ వివరాలు వెల్లడించింది. మిగతా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. నెతన్యాహూ కూటమి మొత్తంగా 55 సీట్లు గెలిచే అవకాశం ఉందని ఐ24 న్యూస్ వార్తా సంస్థ ఎగ్జిట్‌పోల్స్ అంచనా వేశాయి. ప్రధాన పార్టీల కూటములకు మెజారిటీ రాకపోవటంతో ప్రభుత్వం ఏర్పాటులో అరబ్‌పార్టీల కూటమి కీలకపాత్ర పోషించే అవకాశం కనిపిస్తోంది. హంగ్ నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ సాధించేందుకు నెతన్యాహు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే, ప్రభుత్వ ఏర్పాటు కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ అరబ్ పార్టీల కూటమి మద్దతు తీసుకోబోమని స్పష్టంచేశారు. దేశంలో ఏర్పడబోయేది రైట్‌వింగ్ ప్రభుత్వమేనని తేల్చిచెప్పారు. ఫలితాల నేపథ్యంలో నెతన్యాహూకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుభాకాంక్షలు తెలిపారు.