Share News

మస్క్ నిజంగా జీనియస్.. 5 వేల ఉపగ్రహాలు పంపారు: పుతిన్

ABN , Publish Date - Oct 29 , 2026 | 11:53 AM

స్పేస్ఎక్స్ అధినేత, అమెరికా టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్‌పై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసల జల్లు కురిపించారు. మస్క్ నిజంగా జీనియస్ అని ఆయన కొనియాడారు.

మస్క్ నిజంగా జీనియస్.. 5 వేల ఉపగ్రహాలు పంపారు: పుతిన్

ఇంటర్నెట్ డెస్క్: స్పేస్ఎక్స్ అధినేత, అమెరికా టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్‌పై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసల జల్లు కురిపించారు. మస్క్ నిజంగా జీనియస్ అని ఆయన కొనియాడారు. రష్యా రాజధాని మాస్కోలో రష్యా-ఆఫ్రికా సదస్సులో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను పుతిన్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మస్క్‌పై పొగడ్తలు కురిపించారు. మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ ఇప్పటికే 5 వేలకుపైగా ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిందన్నారు. ‘మస్క్‌కు అంతరిక్షంలో ఎన్ని ఉపగ్రహాలు ఉన్నాయి? దాదాపు 5 వేలపైనే. మేము కూడా స్టార్‌లింక్ తరహాలో శాటిలైట్ ఇంటర్నెట్ నెట్‌వర్క్‌ను అభివ‌ృద్ధి చేస్తున్నాం. ఈ నేపథ్యంలో మా అమెరికన్ భాగస్వాములను సంప్రదిస్తున్నాం. వారిలో మస్క్ కూడా ఉన్నారు’ అని పుతిన్ పేర్కొన్నారు.


రష్యా కూడా సొంతంగా శాటిలైట్ ఇంటర్నెట్ నెట్‌వర్క్‌ను అభివ‌ృద్ధి చేస్తోంది. తన పౌరులు, మిలిటరీ కోసం అలాంటి నెట్‌వర్క్‌ను డెవలప్ చేయాలని ముందు నుంచి రష్యా అనుకుంటోంది. కాగా.. స్టార్‌షీల్డ్ యాక్సెస్ కోసం ఉక్రెయిన్, అమెరికా మధ్య వివాదం నడుస్తున్న సమయంలో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యాన్ని సంతరించుకొంది. స్టార్‌షీల్డ్‌ అనేది మిలిటరీ గ్రేడ్ ఉపగ్రహం. స్పేస్ఎక్స్ కంపెనీ దానిని రూపొందించింది. ఈనెల స్టార్‌షీల్డ్ సేవలను ఉపయోగించడంలో సమస్యలు ఎదురయ్యాయని ఉక్రెయిన్‌ తెలిపింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు ఓలోదిమిర్ జెలెన్‌స్కీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య అమెరికా–రష్యా డీజిల్ ఒప్పందం విషయంలో వివాదం జరిగిన తర్వాత ఈ సమస్యలు మొదలయ్యాయి. ఆ సమస్యలకు తాము కారణం కాదని ట్రంప్, మస్క్ పేర్కొన్నారు. స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలను సైనిక అవసరాల కోసం ఉక్రెయిన్ దుర్వినియోగం చేస్తోందని మస్క్ ఆరోపించారు. స్టార్‌షీల్డ్ సేవల్లో అంతరాయాల వల్ల రష్యా పంపిస్తున్న డ్రోన్లను అడ్డుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఉక్రెయిన్ చెబుతోంది. అలాగే, యుద్ధ రంగంలో సైనికులకు అవసరమైన సరుకులను చేరవేయడం కూడా ఆలస్యమవుతోందని పేర్కొంది.


ఇవి కూడా చదవండి...

యానాంలో ఆర్నబ్ తుఫాను విలయం

కాకినాడ సముద్రంలో కొట్టుకుపోయిన కార్గో నౌక

Updated Date - Oct 29 , 2026 | 12:12 PM