Share News

యానాంలో ఆర్నబ్ తుఫాను విలయం

ABN , Publish Date - Oct 28 , 2026 | 07:42 AM

యానాంలో ఆర్నబ్ తుఫాన్ విలయం సృష్టించింది. భారీ వర్షం, విపరీతమైన ఇదురు గాలులు వీచాయి. అర్ధరాత్రి యానాం-అంతర్వేది మధ్య తుఫాను తీరం దాటింది.

యానాంలో ఆర్నబ్ తుఫాను విలయం

ఇంటర్నెట్ డెస్క్: యానాంలో ఆర్నబ్ తుఫాన్ విలయం సృష్టించింది. భారీ వర్షం, విపరీతమైన ఇదురు గాలులు వీచాయి. అర్ధరాత్రి యానాం-అంతర్వేది మధ్య తుఫాను తీరం దాటింది. తుఫాన్ ప్రభావంతో గంటకు 125 నుంచి 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. మరికొన్ని చోట్ల గంటకు 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) తెలిపింది. తీర ప్రాంతం సావిత్రి నగర్ గ్రామంలోకి సముద్రం చొచ్చుకువచ్చింది. గ్రామంలో మూడు అడుగుల మేర నీటి ప్రవాహం కొనసాగింది. దీంతో తుఫాను షెల్టర్లలో స్థానికులు తలదాచుకుంటున్నారు. పరిస్థితిని మంత్రి మల్లాడి కృష్ణారావు, పరిపాలనాదికారి శివరాజ్ మీనా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. తుఫాను ప్రభావంతో సుమారు 20 గంటల పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. దీంతో యానాం అంతా అంధకారం అలుముకుంది. తుఫాను దాటికి పలు విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. తుఫాను ధాటికి యానం ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఇంకా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది.


ఏలూరులో బస్సుపై కూలిన భారీ చెట్టు

ఏలూరులోనూ ఆర్నబ్ తుఫాను బీభత్సం సృష్టించింది. పలాస నుంచి విజయవాడ వెళ్తున్న ప్రతాప్ ట్రావెల్స్ బస్సుపై ఓ భారీ వృక్షం కూలిపోయింది. దీంతో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. అయితే, ఈ ఘటనలో ప్రయాణికులెవరూ గాయపడకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులను సిబ్బంది సురక్షితంగా మరో బస్సులో తరలించారు. కాగా.. ఈ ఘటనలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఆయనను ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు.


ఈ వార్తలనూ చదవండి:

తీరం దాటుతున్న ఆర్నబ్ తుఫాన్..!

ఆర్నబ్ తుఫాన్ వేళ.. రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు

Updated Date - Oct 28 , 2026 | 09:42 AM