పేదల ఆకలితీర్చే అన్న క్యాంటీన్
ABN , Publish Date - Oct 28 , 2026 | 06:38 AM
పేదవాడి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లను మూసేసిన చరిత్ర జగన్‌దని ఏపీ స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విమర్శించారు.
మూసేసిన పైశాచికత్వం జగన్‌ది: కొమ్మారెడ్డి
అమరావతి, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): పేదవాడి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లను మూసేసిన చరిత్ర జగన్‌దని ఏపీ స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విమర్శించారు. మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘అన్న క్యాంటీన్లను నిర్దాక్షిణ్యంగా రద్దు చేసి జగన్ పైశాచికత్వం చూపారు. ఎన్టీఆర్ ఆశయాలతో పేదల కడుపు నింపేందుకు చంద్రబాబు 2014--19లో అన్న క్యాంటీన్లకు శ్రీకారం చుట్టారు. ఊరికో ప్యాలెస్ కట్టుకోవడంపై ఉన్న శ్రద్ధ పేదవాడి ఆకలి తీర్చడంపై జగన్‌కు లేదు. అన్న క్యాంటీన్లు మూసేసిన వాళ్లు మళ్లీ ఏ ముఖం పెట్టుకుని స్థానిక ఎన్నికల్లో ఓట్లు అడుగుతారు?’ అని పట్టాభి ప్రశ్నించారు.
ఈ వార్తలనూ చదవండి:
తీరం దాటుతున్న ఆర్నబ్ తుఫాన్..!
ఆర్నబ్ తుఫాన్ వేళ.. రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు