Share News

అంబరాన్నంటిన సిరిమాను సంబరం

ABN , Publish Date - Oct 28 , 2026 | 06:49 AM

ఉత్తరాంధ్రుల ఇలవేల్పు పైడిమాంబ సిరిమానోత్సవం జోరువానలోనూ వైభవంగా సాగింది. ఆలయ అనువంశిక ధర్మకర్త, గోవా రాష్ట్ర గవర్నర్‌ అశోక్‌ గజపతిరాజు దంపతులు పైడిమాంబను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

అంబరాన్నంటిన సిరిమాను సంబరం

విజయనగరం, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్రుల ఇలవేల్పు పైడిమాంబ సిరిమానోత్సవం జోరువానలోనూ వైభవంగా సాగింది. ఆలయ అనువంశిక ధర్మకర్త, గోవా రాష్ట్ర గవర్నర్‌ అశోక్‌ గజపతిరాజు దంపతులు పైడిమాంబను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వర్షాన్ని లెక్కచేయకుండా వేలాది మంది భక్తులు ఉత్సవాన్ని వీక్షించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ పూజారి బంటుపల్లి వెంకటరావు ప్రత్యేక పూజలు నిర్వహించి, సిరిమానును అధిరోహించారు.

కోట బురుజుపై నుంచి పూసపాటి వంశీయులు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ సిరిమానోత్సవాన్ని వీక్షించారు. కాగా, పైడిమాంబ సిరిమానోత్సవం సందర్భంగా ప్రజలకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ శుభాకాంక్షలు తెలిపారు. విజయనరం చారిత్రక, సాంస్కృతిక, అధ్యాత్మికత వైభవానికి ప్రతీక పైడిమాంబ అమ్మవారేనని పేర్కొన్నారు. సిరిమానోత్సవం వేళ అమ్మవారి దివ్య ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని వేర్వేరు ప్రకటనల్లో ఆకాంక్షించారు.

ఈ వార్తలనూ చదవండి:

తీరం దాటుతున్న ఆర్నబ్ తుఫాన్..!

ఆర్నబ్ తుఫాన్ వేళ.. రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు

Updated Date - Oct 28 , 2026 | 06:49 AM