ముగ్గురు మావోయిస్టులు లొంగుబాటు
ABN , Publish Date - Oct 28 , 2026 | 06:53 AM
ముగ్గురు మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. పోలవరం జిల్లా చింతూరు డీఎస్పీ కార్యాలయంలో మంగళవారం జిల్లా ఎస్పీ చక్రవర్తి మీడియాకు ఈ వివరాలు వెల్లడించారు.
చింతూరు, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): ముగ్గురు మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. పోలవరం జిల్లా చింతూరు డీఎస్పీ కార్యాలయంలో మంగళవారం జిల్లా ఎస్పీ చక్రవర్తి మీడియాకు ఈ వివరాలు వెల్లడించారు. లొంగిపోయిన వారిలో ఛత్తీసగఢ్‌లోని చింతలనార్ పోలీసుస్టేషను ఏరియాకు చెందిన మడవికోయింగ్ అలియాస్ రజని, హేమ్లహిడ్మా అలియాస్ దీపక్, గజరాజు పోలీసుస్టేషన్ పరిధికి చెందిన కొవ్వాసిజోగి అలియాస్ గంగి ఉన్నారు. వీరు 2013, 2014, 2017లలో ఛత్తీసగఢ్ రాష్ట్రం మఠం అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్లలో పాల్గొన్నారని ఎస్పీ తెలిపారు. పార్టీ కళాజాత కార్యక్రమాలు, తుపాకీ తూటాల అసెంబ్లింగ్‌లలో వీరి పాత్ర ఉండేదన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
తీరం దాటుతున్న ఆర్నబ్ తుఫాన్..!
ఆర్నబ్ తుఫాన్ వేళ.. రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు