Share News

మీరు కోలుకున్నాక శిక్షణ ఇస్తా.. భారత పైలట్‌తో యూఏఈ అధ్యక్షుడి సరదా సంభాషణ..

ABN , Publish Date - Oct 29 , 2026 | 09:41 AM

ఫ్లై దుబాయ్ విమానం‌లో ప్రాణాలకు తెగించి ప్రయాణికులను కాపాడిన భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్‌పై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ప్రశంసలు కురిపించారు.

మీరు కోలుకున్నాక శిక్షణ ఇస్తా.. భారత పైలట్‌తో యూఏఈ అధ్యక్షుడి సరదా సంభాషణ..
Smit Machchhar with UAE President

ఇంటర్నెట్ డెస్క్: ఫ్లై దుబాయ్ విమానం‌లో ప్రాణాలకు తెగించి ప్రయాణికులను కాపాడిన భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్‌పై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ప్రశంసలు కురిపించారు. విమానంలో దాడికి గురై తీవ్రంగా గాయపడిన పైలట్‌ను ఆప్యాయంగా పలకరించారు. ఆయన గాయం గురించి అడిగి తెలుసుకున్నారు. కోలుకున్న తర్వాత పోరాట శిక్షణ ఇస్తానని చెప్పడంతో అక్కడున్నవారు నవ్వుకున్నారు (UAE President with Smit Machchhar).


సత్కార కార్యక్రమానికి స్మిత్ మచ్చర్ చేతికి కట్టు వేసుకుని హాజరయ్యారు. ఈ సందర్భంగా యూఏఈ అధ్యక్షుడు ఆయన గాయాన్ని పరిశీలించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. 'నువ్వు ఎప్పుడు కోలుకుంటావు?' అని అధ్యక్షుడు ప్రశ్నించగా, కోలుకోవడానికి సుమారు రెండు నెలలు పట్టవచ్చని స్మిత్ సమాధానమిచ్చారు. దీనికి అధ్యక్షుడు సరదాగా స్పందిస్తూ.. 'నువ్వు కోలుకున్నాక నీకు ఎలా పోరాడాలో శిక్షణ ఇవ్వాలని అనుకుంటున్నాను' అని చెప్పారు. దీంతో ఇద్దరూ నవ్వుకున్నారు. అధ్యక్షుడి ఆప్యాయతకు స్మిత్ మచ్చర్ కృతజ్ఞతలు తెలిపారు (UAE bravery award).


దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లై దుబాయ్ విమానంలో జరిగిన ఘటనలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన కెప్టెన్ స్మిత్ మచ్చర్‌తో పాటు విమాన సిబ్బందిని యూఏఈ అధ్యక్షుడు సత్కరించారు (Dubai Tel Aviv flight). సత్కార కార్యక్రమంలో యూఏఈ అధ్యక్షుడు విమాన సిబ్బంది, ప్రయాణికులను ఉద్దేశించి ఆప్యాయంగా మాట్లాడారు. 'జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా యూఏఈ మీ దేశం. ఇక్కడ మీకు ఇల్లు, కుటుంబం ఉన్నాయని మర్చిపోకండి' అంటూ అధ్యక్షుడు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

మూడు మ్యాచ్‌లకే భువనేశ్వర్‌పై వేటు పడనుందా.. అశ్విన్ కీలక వ్యాఖ్యలు..


పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Updated Date - Oct 29 , 2026 | 09:57 AM