ఎప్‌స్టీన్ ప్రస్తావన.. ట్రంప్ ఆసక్తికర సమాధానం..
ABN , Publish Date - Oct 29 , 2026 | 10:44 AM
అమెరికా లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్ గురించి ఎట్టకేలకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగా స్పందించారు. నవంబర్ 3న జరగబోయే మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో ఒహియోలో జరిగిన సభలో ఓ నిరసనకారుడు ఎప్‌స్టీన్‌తో ఉన్న సంబంధాల గురించి ట్రంప్‌ను ప్రశ్నించాడు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్ గురించి ఎట్టకేలకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగా స్పందించారు. నవంబర్ 3న జరగబోయే మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో ఒహియోలో జరిగిన సభలో ఓ నిరసనకారుడు ఎప్‌స్టీన్‌తో ఉన్న సంబంధాల గురించి ట్రంప్‌ను ప్రశ్నించాడు. దీంతో ఎప్‌స్టీన్ గురించి ట్రంప్ ఆసక్తికరంగా స్పందించారు. 'ఎప్‌స్టీన్ ఓ పిచ్చివాడని భావించి 20 ఏళ్ల క్రితమే అతడిని ఓ క్లబ్ నుంచి గెంటేశాను' అని ట్రంప్ చెప్పారు (Donald Trump about Jeffrey Epstein).
'ఎప్‌స్టీన్‌ను సుమారు 20 ఏళ్ల క్రితమే నా క్లబ్ నుంచి బయటకు పంపించా. అతడి ప్రవర్తన నచ్చకపోవడంతో ఆ నిర్ణయం తీసుకున్నా. నేను చేసింది చాలా గొప్ప పని. మీకు చెప్పాలి. ఎప్‌స్టీన్ ఎక్కువగా డెమోక్రాట్లతో కలిసి తిరిగేవాడు. నాకు ఎప్‌స్టీన్ వ్యవహారంతో ఎలాంటి సంబంధమూ లేదు. నేను పూర్తిగా నిర్దోషిని' అని అన్నారు. అలాగే దేశవ్యాప్తంగా తన ర్యాలీలకు నిత్యం అంతరాయం కలిగిస్తున్న నిరసనకారులను ఆయన 'అనారోగ్యకరమైన, బలహీనమైన వ్యక్తులు'గా అభివర్ణించారు (Trump Epstein remarks).
కాగా, ఒహియో సెనేటర్ జాన్ హస్టెడ్ శరీరం గురించి ట్రంప్ విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు (Ohio rally Jon Husted). గతంలో కళాశాల స్థాయిలో ఫుట్‌బాల్ ఆడిన హస్టెడ్ శరీర దారుఢ్యాన్ని ప్రశంసించారు. అతడి భుజాలు ఉక్కులా బలంగా ఉన్నాయని అన్నారు. అలాగే హస్టెడ్ శరీర భాగాలను తనదైన శైలిలో వర్ణించారు. హస్టెడ్ శరీరాకృతి గురించి ట్రంప్ ఇంతకుముందు కూడా పలు సభల్లో మాట్లాడారు. అయితే తాజా రాజకీయ ప్రచార సభలో అభ్యర్థి విధానాలు, ఎన్నికల హామీల కంటే ఆయన శరీరాకృతిపై ఎక్కువగా మాట్లాడటం చర్చకు దారితీసింది.
ఇవి కూడా చదవండి..
మూడు మ్యాచ్‌లకే భువనేశ్వర్‌పై వేటు పడనుందా.. అశ్విన్ కీలక వ్యాఖ్యలు..
పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..