చనిపోయినా ఎంత బుజ్జిగున్నావ్ చిట్టితల్లీ
ABN , Publish Date - Oct 29 , 2026 | 07:27 AM
చనిపోయినా కూడా ఎంత అందంగా ఉన్నావ్ చిట్టి తల్లీ.. అంటూ తన కూతురిని చంపిన అనంతరం రాసుకున్న సూసైడ్ నోట్‌లో ప్రస్తావించాడా తండ్రి.
2 ఏళ్ల చిన్నారిని చంపిన తర్వాత.. సూసైడ్‌నోట్‌లో పేర్కొన్న తండ్రి
దంపతుల మృతి కేసులో వీడని మిస్టరీ
హైదరాబాద్ సిటీ: చనిపోయినా కూడా ఎంత అందంగా ఉన్నావ్ చిట్టి తల్లీ.. అంటూ తన కూతురిని చంపిన అనంతరం రాసుకున్న సూసైడ్ నోట్‌లో ప్రస్తావించాడా తండ్రి. ఏం కష్టం వచ్చిందో ఏమో తెలియదు గానీ.. తన చిన్నారి కుమార్తెకు విషమిచ్చి చంపి.. భార్యాభర్తలు ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. కేపీహెచ్‌బీ పోలీ్‌సస్టేషన్ పరిధిలో మంగళవారం వెలుగులోకి వచ్చిన ఈ కేసులో మిస్టరీ వీడలేదు.
పొట్టలో దొరికిన పదార్థాలు ఫోరెన్సిక్‌కు..
గోపీనాథ్, సమత దంపతులు తమ కుమార్తె స్నిగ్ధను ముందుగా చంపిన అనంతరం సూసైడ్‌నోట్ రాసి వారిద్దరూ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. తాము కూడా విషం తాగి ఆపై ఉరి వేసుకున్నారా అని పోస్టుమార్టం చేసిన డాక్టర్లు అనుమానం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దాంతో వారి పొట్టలో ఉన్న పదార్థాలను(విసరి) ఫోరెన్సిక్ నివేదిక కోసం పంపించారు. కుటుంబసభ్యులను విచారించినా ఎటువంటి వివరాలూ తెలియలేదు. దీంతో కేసు మిస్టరీ పోలీసులకు సవాల్‌గా మారింది. బెంగాలీ భాషలో రాసిన సూసైడ్ నోట్ ఆధారంగా మొదట కుమార్తె స్నిగ్ధను చంపి, తర్వాత సమత, గోపీనాథ్ ఉరివేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాత ఈ ఘటనటపై స్పష్టత వస్తుందని ఎస్‌హెచ్‌ఓ విజయ్‌కుమార్ తెలిపారు.
మొబైల్ డేటా డిలీట్
తమ చావుకు ఎవరూ కారణం కాదని, మేం ఎప్పుడో చనిపోవడానికి నిర్ణయం తీసుకున్నామని, మూడో వ్యక్తి ప్రమేయం లేదని సూసైడ్‌నోట్‌లో స్పష్టం చేసినప్పటికీ, సూసైడ్‌కు ముందు భార్య భర్తల మొబైల్‌లో డేటాను డిలీట్ చేయడం అనుమానాలకు తావిస్తోంది. ఈ మేరకు ఇద్దరి మొబైల్స్‌ను ఎఫ్‌ఎస్ఎల్‌కు పంపి, డేటాను రీట్రీవ్ చేస్తున్నామని, డేటా రీట్రీవ్ అయితే ఏదైనా బలమైన క్లూ దొరికే అవకాశం ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఇద్దరి కాల్‌రికార్డుల అధారంగా దర్యాప్తు ముమ్మరం చేసినట్లు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు గడువును పొడిగించండి
బహిరంగ మార్కెట్‌లోకి పంప్డ్ స్టోరేజీ విద్యుత్!
Read Latest AP News And Telangana News And International News And Telugu News