Share News

హైదరాబాద్‌లోని ఈ ఏరియాల్లో 11 గంటల నుంచి కరెంట్ కట్

ABN , Publish Date - Oct 28 , 2026 | 06:55 AM

హైదరాబాద్‌లోని ఆయా ఏరియాల్లొ బుధవారం విద్యుత్ సరఫరా ఉండదని ట్రాన్స్ కో అధికారులు తెలిపారు.

హైదరాబాద్‌లోని ఈ ఏరియాల్లో 11 గంటల నుంచి కరెంట్ కట్
Hyderabad Power Cut

పీర్జాదిగూడ(హైదరాబాద్): నేడు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలగనున్నట్లు బోడుప్పల్‌ ఏఈ వేణుగోపాల్‌ తెలిపారు. హెచ్‌ఎండీఏ పనులలో భాగంగా బోడుప్పల్‌ సబ్‌-స్టేషన్‌ డెడికేటేడ్‌ ఫీడర్‌ షిఫ్టింగ్‌ పనులు, రాబోయే వాసవి నగర్‌ సబ్‌ స్టేషన్‌ కోసం 33కేవీ లైన్‌ స్ర్టింగింగ్‌ పనులు, బంగారు మైసమ్మ ఆలయం నుంచి ప్రివిలేజ్‌ కాలనీ వరకు లైన్ల మార్పిడి కొరకు 6 నంబర్ల ఎం+6 టవర్ల నిర్మాణ పనుల నిమిత్తం బుధవారం ఉదయం 11 నుంచి సాయంత్రం 4 వరకు విద్యుత్‌ అంతరాయం ఉంటుంది. 11 కేవీ ఇందిరానగర్‌ ఫీడర్‌ పరిధిలోని సాయిరామ్‌ కాలనీ, శ్రీనివాస్‌ బ్రదర్స్‌ కాలనీ, బృందావన్‌ కాలనీ, ఆనంద్‌ నగర్‌, ఎస్సీ కాలనీ, బొమ్మక్‌ బ్రదర్స్‌ కాలనీ, తూర్పు హనుమాన్‌ నగర్‌,


city1.2.jpgపశ్చిమ హనుమాన్‌ నగర్‌, సన్నీ బేకరీ మెయిన్‌ రోడ్‌, సాయి భవాని నగర్‌, 11 కేవీ వివేకానంద నగర్‌ ఫీడర్‌ పరిధిలోని మణికంఠ నగర్‌, వివేకానంద నగర్‌, శ్రీలక్ష్మీనగర్‌, లెక్చరర్స్‌ కాలనీ, ఐఐసీటీ కాలనీ, భీమ్‌ రెడ్డి కాలనీ, అశోక్‌ నగర్‌, గ్రీన్‌ సిటీ కాలనీ, అనగాపురి కాలనీ. 11 కేవీ మారుతీ నగర్‌ ఫీడర్‌ పరిధిలోని యాదవ్‌ బస్తీ, సుభాష్‌ నగర్‌ కాలనీ, ఎస్సీ బస్తీ, మాన్సాని కాలనీ, మణికంఠ నగర్‌, మారుతీ నగర్‌, సిద్ధి వినాయక నగర్‌, శ్రీ సాయి ఎన్‌క్లేవ్‌, పెంటా రెడ్డి కాలనీలలో విద్యుత్‌ నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. వినియోగదారులందరూ సహకరించగలరని కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి:

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు

నేడు, రేపు పలు రైళ్లు రద్దు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 28 , 2026 | 06:55 AM