నేడు, రేపు పలు రైళ్లు రద్దు
ABN , Publish Date - Oct 28 , 2026 | 05:57 AM
ఆర్నబ్ తుఫాన్ ప్రభావం రైళ్లు, విమానాల రాకపోకలపై పడింది. మంగళవారం వివిధ స్టేషన్ల నుంచి బయల్దేరాల్సిన రైళ్లను భారీ వర్షాలు, గాలుల కారణంగా రద్దు చేశారు. మరికొన్ని రైళ్లను నిలిపివేశారు.
జాబితాలో గోదావరి, గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు
భోగాపురం, గన్నవరంలో విమానాలు క్యాన్సిల్
విశాఖపట్నం, విజయవాడ, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): ఆర్నబ్ తుఫాన్ ప్రభావం రైళ్లు, విమానాల రాకపోకలపై పడింది. మంగళవారం వివిధ స్టేషన్ల నుంచి బయల్దేరాల్సిన రైళ్లను భారీ వర్షాలు, గాలుల కారణంగా రద్దు చేశారు. మరికొన్ని రైళ్లను నిలిపివేశారు. అయితే రద్దుచేసిన రైళ్ల టికెట్ సొమ్మును వెంటనే చెల్లించేలా స్టేషన్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటుచేశారు. హెల్ప్‌లైన్ కేంద్రాలను ప్రారంభించారు. మంగళవారం సికింద్రాబాద్ నుంచి విశాఖ వచ్చే గరీబ్‌రథ్, గోదావరి ఎక్స్‌ప్రెస్ వంటి పలు రైళ్లను మాత్రం రద్దు చేశారు.
భోగాపురం నుంచి విమానాలు రద్దు
విశాఖలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, విజయవాడలోని గన్నవరం నుంచి బయల్దేరాల్సిన పలు విమానాలు మంగళవారం తుఫాన్ కారణంగా రద్దయ్యాయి. గాలుల తీవ్రత, నిరంతర వర్షం వల్ల విశాఖపట్నం నుంచి వెళ్లాల్సిన, ఇక్కడకు రావలసిన 9 ఇండిగో విమానాలు(18 ఆపరేషన్లు) రద్దయ్యాయి. వీటిలో హైదరాబాద్‌కు వెళ్లాల్సినవి నాలుగు కాగా, తిరుపతి, చెన్నై, కోల్‌కతా, కర్నూలు, బెంగుళూరు, ఢిల్లీ విమానాలు ఒక్కొక్కటి ఉన్నాయి. వివిధ ప్రాంతాల నుంచి గన్నవరం చేరుకునే అన్ని విమానాలూ రద్దయ్యాయి.
ఈ వార్తలనూ చదవండి:
తీరం దాటుతున్న ఆర్నబ్ తుఫాన్..!
ఆర్నబ్ తుఫాన్ వేళ.. రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు