Share News

ఇద్దరు కూతుళ్లతో కలిసి మంజీరాలో దూకిన తల్లి

ABN , Publish Date - Oct 28 , 2026 | 06:34 AM

మంజీరా నదిలో దూకి మహిళ, ఆమె ఇద్దరు కుమార్తెలు గల్లంతైన విషాద ఘటన మెదక్‌ జిల్లా కొల్చారం మండలం చిన్నఘనాపూర్‌లో చోటుచేసుకుంది.

ఇద్దరు కూతుళ్లతో కలిసి మంజీరాలో దూకిన తల్లి
Mother and two daughters missing

  • గాలిస్తున్న పోలీసులు..

  • మెదక్‌ జిల్లా చిన్నఘనాపూర్‌లో ఘటన

కొల్చారం, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): మంజీరా నదిలో దూకి మహిళ, ఆమె ఇద్దరు కుమార్తెలు గల్లంతైన విషాద ఘటన మెదక్‌ జిల్లా కొల్చారం మండలం చిన్నఘనాపూర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా మల్కాపూర్‌ గ్రామానికి చెందిన సరిత (25) భర్త గతంలోనే మృతిచెందగా.. తన ఇద్దరు కుమార్తెలు వైష్ణవి, శ్రావణితో కలిసి హైదరాబాద్‌లో నివాసముంటూ సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తోంది. మంగళవారం సరిత తన ఆధార్‌ కార్డులో సవరణకోసం కొల్చారంలో ఉంటున్న అక్క వద్దకు వచ్చింది. సాయంత్రం ఏడుపాయల సమీపంలోని మంజీరా ఒడ్డుకు చేరుకున్న సరిత.. పిల్లలతో కలిసి నదిలో దూకుతున్నట్లు తన తండ్రి బాలకృష్ణకు ఫోన్‌చేసి చెప్పింది.


దీంతో అతడు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు సరిత సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ ఏడుపాయల మొదటి వంతెన వద్ద ఉన్నట్లు గుర్తించారు. వెంటనే మెదక్‌ సీఐ కృష్ణమూర్తి, కొల్చారం ఎస్సై మొహినుద్దీన్‌ తమ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకోగా.. వంతెన సమీపంలో నది ఒడ్డున సరిత, ఆమె కుమార్తెల చెప్పులు, సెల్‌ఫోన్‌ లభించాయి. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గజ ఈతగాళ్ల సాయంతో రెండు గంటల పాటు నదిలో విస్తృతంగా గాలించినా ఆచూకీ లభించలేదు. చీకటి పడటంతో గాలింపు చర్యలను నిలిపివేశారు. బుధవారం ఉదయం తిరిగి ప్రారంభిస్తామని పోలీసులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

రేషన్‌ బియ్యం.. బ్రాండెడ్‌ దందా

రేషన్‌లో 6 రకాల నిత్యావసరాలు!

పంటల ధరలు పైపైకి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 28 , 2026 | 06:34 AM