మధ్యవర్తిత్వం ద్వారా సత్వర న్యాయం
ABN , Publish Date - Oct 28 , 2026 | 06:36 AM
మధ్యవర్తిత్వం ద్వారా సత్వర న్యాయం అందించవచ్చని, తద్వారా సామరస్యపూర్వక సమాజ నిర్మాణం జరుగుతుందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హరి అన్నారు.
న్యాయవాదులకు శిక్షణలో జస్టిస్ రవినాథ్ తిల్హరి
అమరావతి, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): మధ్యవర్తిత్వం ద్వారా సత్వర న్యాయం అందించవచ్చని, తద్వారా సామరస్యపూర్వక సమాజ నిర్మాణం జరుగుతుందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హరి అన్నారు. సుప్రీంకోర్టు మీడియేషన్ అండ్ కన్సిలియేషన్ ప్రాజెక్ట్ కమిటీ నేతృత్వంలో ఏపీ న్యాయసేవాధికార సంస్థ, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం మధ్యవర్తిత్వంపై న్యాయవాదులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సుప్రీంకోర్టు మీడియేషన్ అండ్ కన్సిలియేషన్ ప్రాజెక్ట్ కమిటీకి చెందిన సీనియర్ ట్రైనర్ అనుజా సక్సేనా సమగ్ర శిక్షణ అందించారు.
రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ కార్యనిర్వాహక అధ్యక్షులు, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హరి, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎన్.జయసూర్య, జస్టిస్ టీసీడీ శేఖర్, జస్టిస్ తుహిన్ కుమార్ పాల్గొని మధ్యవర్తిత్వం పై న్యాయవాదులకు మార్గనిర్దేశం చేశారు. రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్యకార్యదర్శి బివిఎస్ హిమబిందు, ఏపీ హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ కార్యదర్శి జి.మాలతి పాల్గొన్నారు. రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఉపకార్యదర్శి హెచ్.అమరరంగేశ్వరరావు, మధ్యవర్తిత్వంపై అనుభవం ఉన్న న్యాయవాదులు పాల్గొన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
తీరం దాటుతున్న ఆర్నబ్ తుఫాన్..!
ఆర్నబ్ తుఫాన్ వేళ.. రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు