Share News

బహిరంగ మార్కెట్‌లోకి పంప్డ్‌ స్టోరేజీ విద్యుత్‌!

ABN , Publish Date - Oct 29 , 2026 | 06:45 AM

బహిరంగ మార్కెట్‌లో అధిక ధరకు విక్రయించే విద్యుత్‌ ప్లాంట్ల జాబితాలోకి పంప్డ్‌ స్టోరేజీ జల విద్యుత్‌ కేంద్రాలను కూడా చేర్చాలని కేంద్ర విద్యుత్‌ నియంత్రణ మండలి(సీఈఆర్‌సీ) ప్రతిపాదించింది.

బహిరంగ మార్కెట్‌లోకి పంప్డ్‌ స్టోరేజీ విద్యుత్‌!
Pumped Storage Power

  • అధిక ధరకు విక్రయించేందుకు సీఈఆర్‌సీ ప్రతిపాదన

హైదరాబాద్‌, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): బహిరంగ మార్కెట్‌లో అధిక ధరకు విక్రయించే విద్యుత్‌ ప్లాంట్ల జాబితాలోకి పంప్డ్‌ స్టోరేజీ జల విద్యుత్‌ కేంద్రాలను కూడా చేర్చాలని కేంద్ర విద్యుత్‌ నియంత్రణ మండలి(సీఈఆర్‌సీ) ప్రతిపాదించింది. ఈ మేరకు ప్రభావ వర్గాల నుంచి అభిప్రాయ సేకరణ కోరుతూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.


ప్రస్తుతం గ్యాస్‌ ఆధారిత విద్యుత్‌ కేంద్రాలు, దిగుమతి చేసుకున్న బొగ్గుతో పనిచేసే విద్యుత్‌ కేంద్రాలు, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‌ సిస్టమ్స్‌కు మాత్రమే ‘హైప్రైస్‌ డే ఎహెడ్‌ మార్కెట్‌’(హెచ్‌పీ డీఏఎం)లో అధిక ధరకు విద్యుత్‌ అమ్ముకునే అవకాశం ఉంది. పంప్డ్‌ స్టోరేజ్‌ ప్లాంట్లను కూడా ఈ జాబితాలో చేర్చడం ద్వారా విద్యుత్‌ డిమాండ్‌ అధికంగా ఉన్న సమయాల్లో విద్యుత్‌ను ఎక్కువ ధరకు విక్రయించే అవకాశం కలుగుతుందని సీఈఆర్‌సీ తెలిపింది.


ఈ వార్తలు కూడా చదవండి:

అప్రాధాన్య పోస్టుకు జయేశ్‌ రంజన్‌

దీపావళి తర్వాత భారీ ప్రక్షాళన

ఆ జూనియర్‌ లెక్చరర్లను సర్వీసులోకి తీసుకోండి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 29 , 2026 | 06:45 AM