హర్దీప్ పురి మంత్రి పదవి సేఫ్!
ABN , Publish Date - Oct 29 , 2026 | 07:02 AM
కేంద్రమంత్రి హర్దీ్‌పసింగ్ పురి పదవి విషయంలో నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెర పడింది. ఆయనను మరోసారి రాజ్యసభకు పంపాలని బీజేపీ నిర్ణయించింది.
న్యూఢిల్లీ, అక్టోబరు 28: కేంద్రమంత్రి హర్దీ్‌పసింగ్ పురి పదవి విషయంలో నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెర పడింది. ఆయనను మరోసారి రాజ్యసభకు పంపాలని బీజేపీ నిర్ణయించింది. కేంద్ర మాజీ మంత్రి ఎల్.మురుగన్ రాజీనామాతో మధ్యప్రదేశ్‌లో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి త్వరలో జరగనున్న ఉప ఎన్నికకు హర్దీప్ నుఅభ్యర్థిగా బుధవారం ప్రకటించింది. గతంలో ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన హర్దీప్ పురి పదవీకాలం నవంబరులో ముగియనుండగా..ఇంతకుముందు 8రాజ్యసభ స్థానాలకు బీజేపీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో హర్దీ్‌పకు చోటు కల్పించలేదు. ఎప్‌స్టీన్ ఫైల్స్ వివాదం నేపథ్యంలో ఆయనను మంత్రి పదవి నుంచి తొలగిస్తారన్న ప్రచారం జరిగింది. కానీ, మోదీ మంత్రివర్గంలో ఉన్న ఏకైక సిక్కు నేత కావడంతో హర్దీప్ విషయంలో పార్టీ పునరాలోచించినట్లు తెలుస్తోంది. ఈ ఉప ఎన్నికకు సంబంధించి నవంబరు 12న పోలింగ్ జరగనుంది.