Share News

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు గడువును పొడిగించండి

ABN , Publish Date - Oct 29 , 2026 | 06:53 AM

మార్చిలో ఎన్నికలు జరగనున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల నమోదు గడువును మరో నాలుగు వారాల పాటు పొడిగించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని టీపీసీసీ ఎలక్షన్‌ కమిషన్‌ సమన్వయ కమిటీ కోరింది.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు గడువును పొడిగించండి
TPCC

  • డిగ్రీ సర్టిఫికెట్‌పై గెజిటెడ్‌ అధికారి ధ్రువీకరణ నిబంధనను తొలగించండి: టీపీసీసీ

మార్చిలో ఎన్నికలు జరగనున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల నమోదు గడువును మరో నాలుగు వారాల పాటు పొడిగించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని టీపీసీసీ ఎలక్షన్‌ కమిషన్‌ సమన్వయ కమిటీ కోరింది. అలాగే ఓటరు నమోదుకు సంబంధించి డిగ్రీ సర్టిఫికెట్‌పైన గెజిటెడ్‌ అధికారి ధ్రువీకరణ నిబంధనను తొలగించాలంది. రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి సుదర్శన్‌రెడ్డిని బుధవారం ఆయన చాంబర్లో కలిసిన టీపీసీసీ ఎలక్షన్‌ కమిషన్‌ సమన్వయ కమిటీ చైర్మన్‌ పులిపాటి రాజే్‌షకుమార్‌, ఎస్‌ఐఆర్‌ రాష్ట్ర కో ఆర్డినేటర్‌ గంప గోపాల్‌ ఈ మేరకు వినతిపత్రం ఇచ్చారు. నవంబర్‌ 6న గడువు ముగియనున్న నేపథ్యంలో మరో నాలుగు వారాలు గడువు పొడిగించాలని కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి:

అప్రాధాన్య పోస్టుకు జయేశ్‌ రంజన్‌

దీపావళి తర్వాత భారీ ప్రక్షాళన

ఆ జూనియర్‌ లెక్చరర్లను సర్వీసులోకి తీసుకోండి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 29 , 2026 | 06:53 AM