గణాంక శాఖలో 102 పోస్టులు
ABN , Publish Date - Oct 29 , 2026 | 07:09 AM
డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ శాఖలో 102 పోస్టుల భర్తీకి టీఎ్‌సపీఎస్సీ బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది.
నోటిఫికేషన్ జారీ చేసిన టీఎస్‌పీఎస్సీ
డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ శాఖలో 102 పోస్టుల భర్తీకి టీఎ్‌సపీఎస్సీ బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. జోనల్ క్యాడర్ పోస్టులు మండల ప్లానింగ్ అండ్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్ / అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్ ఖాళీలను భర్తీ చేయనున్నట్టు కమిషన్ కార్యదర్శి నోటిఫికేషన్‌లో తెలిపారు. డిగ్రీలో స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్టుగా ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. ఆసక్తి, అర్హత కలవారు ఈనెల 30 నుంచి నవంబరు 27 లోపు దరఖాస్తు చేసుకోవాలని కార్యదర్శి కోరారు. వయోపరిమితి 18 నుంచి 44గా నిర్ణయించారు.