రంగారెడ్డి జిల్లాలో విషాదం.. ఆర్టీసీ బస్సును ఢీకొన్న బైక్.. యువకుడి మృతి
ABN , Publish Date - Oct 29 , 2026 | 11:35 AM
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విప్రో కంపెనీ సమీపంలో ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును బైక్ ఢీకొనడంతో రాహుల్ (22) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
రంగారెడ్డి, అక్టోబర్ 29: నగరంలోని మహేశ్వరం పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. విప్రో కంపెనీ సమీపంలో ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును బైక్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కేసీ తండాకు చెందిన రాహుల్ (22) అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదంలో యువకుడు మృతి చెందిన విషయం తెలుసుకున్న అతడి బంధువులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. అనంతరం మహేశ్వరం ఆర్టీసీ డిపో వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. ఈ ఘటనతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
సమాచారం అందుకున్న ఎస్సై ధనుంజయ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదంలో మృతి చెందిన రాహుల్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. యువకుడి మృతిపై బంధువులు ఆందోళన వ్యక్తం చేయడంతో పోలీసులు జోక్యం చేసుకుని వారికి సర్దిచెప్పారు. దీంతో ఆందోళన సద్దుమణిగింది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
అప్రాధాన్య పోస్టుకు జయేశ్ రంజన్
ఆ జూనియర్ లెక్చరర్లను సర్వీసులోకి తీసుకోండి
Read Latest AP News And Telangana News