ఆర్నబ్ తుఫాన్‌పై అమిత్ షా సమీక్ష.. త్వరలోనే బాధిత రాష్ట్రాలకు కేంద్ర బృందాలు
ABN , Publish Date - Oct 29 , 2026 | 11:57 AM
తుఫాన్ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సీఎంలతో ‘సైక్లోన్ ఆర్నబ్’ పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు.
ఢిల్లీ, అక్టోబర్ 29: తుఫాన్ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సీఎంలతో ‘సైక్లోన్ ఆర్నబ్’ పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. కేంద్రం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి హామీ ఇచ్చారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్‌ఎఫ్(NDRF), ఎస్డీఆర్‌ఎఫ్(SDRF) బృందాలు రంగంలోకి దిగాయన్నారు. యుద్ధప్రాతిపదికన సహాయ, పునరావాస చర్యలు కొనసాగుతున్నాయని అమిత్ షా తెలిపారు. నష్ట తీవ్రతను అంచనా వేసేందుకు త్వరలోనే తుఫాన్ ప్రభావిత రాష్ట్రాలకు కేంద్ర బృందాలు రానున్నట్లు చెప్పారు. ప్రకృతి విపత్తు వేళ బాధితులకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు.
ఇప్పటికే ఏపీలో ఆర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు నాయుడు లేఖ రాయడంతో పాటు ఫోన్‌లో మాట్లాడిన విషయం తెలిసిందే. తుఫాన్ కారణంగా రాష్ట్రంలో పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నట్టు తెలిపారు. తుఫాన్ ప్రభావంతో ఆస్తి, ప్రాణ నష్టం కలగకుండా తీసుకున్న ముందస్తు చర్యలను వివరించారు. త్వరితగతిన తుఫాన్ నష్టంపై అంచనాకు కేంద్ర బృందాలను పంపాలని సీఎం చంద్రబాబు కోరారు.
ఇవి కూడా చదవండి...
వైసీపీవి అసత్య ప్రచారాలు.. విశాఖకు కూటమి ఏం చేసిందో చెబుతాం: ఎంపీ శ్రీభరత్
ఆర్నబ్ తుఫాన్ వేళ నిద్రాహారాలు మాని పనిచేశారు.. మంత్రి లోకేశ్ ప్రశంసలు
Read Latest AP News And Telugu News