ఆర్నబ్ తుఫాన్ వేళ నిద్రాహారాలు మాని పనిచేశారు.. మంత్రి లోకేశ్ ప్రశంసలు
ABN , Publish Date - Oct 29 , 2026 | 11:35 AM
ఏపీలో ఆర్నబ్ తుఫాన్ బీభత్సం, అధికార యంత్రాంగం సహాయక చర్యలపై మంత్రి నారా లోకేశ్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. తుఫాన్ తీరం దాటే సమయంలో రాష్ట్రంలో అస్తవ్యస్థ పరిస్థితులు నెలకొన్నాయన్నారు.
అమరావతి, అక్టోబర్ 29: ఏపీలో ఆర్నబ్ తుఫాన్ పెను బీభత్సం సృష్టించింది. తుఫాన్ తీరం దాటే సమయంలో పెనుగాలులు వీచడంతో ఎక్కడికక్కడ భారీ చెట్లు నేలకొరిగాయి. తుఫాన్ ప్రభావంతో అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో జనజీవనం స్తంభించింది. అయితే తుఫాన్ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ప్రభుత్వ యంత్రాంగం పూర్తి అప్రమత్తమై వేగంగా సహాయక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఏపీలో ఆర్నబ్ తుఫాన్ బీభత్సం, అధికార యంత్రాంగం సహాయక చర్యలపై మంత్రి నారా లోకేశ్ ‘ఎక్స్’వేదికగా స్పందించారు. సహాయక చర్యల్లో పాల్గొన్న కార్మికులు, అధికారులు, టీడీపీ నేతలు, కార్యకర్తలను ప్రశంసించారు. తుఫాన్ తీరం దాటే సమయంలో రాష్ట్రంలో అస్తవ్యస్థ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. అధికార యంత్రాంగం నిద్రాహారాలు మాని సాధారణ పరిస్థితికి తీసుకొచ్చినట్లు మంత్రి చెప్పుకొచ్చారు.
లోకేశ్ పోస్ట్
‘ఆర్నబ్ తుఫాన్ బీభత్సం సృష్టించి వెళ్ళింది. పల్లెలు, పట్టణాలు, నగరాలు తుఫాన్ తీరం దాటే సమయంలో అస్తవ్యస్తమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు, సిబ్బంది, అధికార యంత్రాంగం, టీడీనీ నేతలు, కార్యకర్తలు సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సాధారణ పరిస్థితి తీసుకొచ్చేందుకు నిద్రాహారాలు మాని పని చేశారు. ప్రకృతి విపత్తు వేళ అంతా కలిసి జన జీవనానికి ఎటువంటి ఆటంకం లేకుండా చేయడం.. సమష్టితత్వానికి, సేవాస్పూర్తికి నిదర్శనంగా నిలుస్తోంది’ అంటూ ఎక్స్‌లో మంత్రి లోకేశ్ పోస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి...
ఆర్నబ్ తుఫాన్ నష్టపరిహారంపై చంద్రబాబు కీలక ఆదేశాలు
వైసీపీవి అసత్య ప్రచారాలు.. విశాఖకు కూటమి ఏం చేసిందో చెబుతాం: ఎంపీ శ్రీభరత్
Read Latest AP News And Telugu News