సత్యసాయి జిల్లాలో మంత్రి రాజకీయం.. టీడీపీ గూటికి వైసీపీ అభ్యర్థులు
ABN , Publish Date - Oct 29 , 2026 | 10:07 AM
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో వైసీపీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు.. మంత్రి సవిత సమక్షంలో టీడీపీలో చేరారు. దీంతో మంత్రి సవిత పాలిటిక్స్ ఓ రేంజ్‌లో ఉన్నాయంటూ రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నాయి.
శ్రీ సత్యసాయి జిల్లా, అక్టోబర్ 29: జిల్లాలోని పెనుకొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి దిగిన ఇద్దరు అభ్యర్థులు బీసీ సంక్షేమ శాఖామంత్రి సవిత కార్యాలయంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ మేరకు మంత్రి సవిత రాజకీయ వర్గాల దృష్టిని ఆకర్షించారు.
జిల్లాలోని పెనుకొండ నియోజకవర్గంలోని 12వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా వైసీపీ నుంచి పోటీ చేస్తున్న గుణ, 20వ వార్డు కౌన్సిలర్‌గా వైసీపీ తరఫున పోటీ చేస్తున్న గాయత్రి.. ఇద్దరు వైసీపీ నేతలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ మేరకు గుణ, గాయత్రి తమ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి సవిత కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం మంత్రి వారికి టీడీపీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పెనుకొండలో మంత్రి సవిత చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరామంటూ వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థులు తెలిపారు. ఈ మేరకు మంత్రి సవితపై రాజకీయ వర్గాలు ప్రశంసలు కురిపిస్తున్నాయి.
ఈ వార్తలనూ చదవండి:
ఆర్నబ్ తుఫాన్ బాధితులకు సీఎం చంద్రబాబు భారీ ఊరట