ఆర్నబ్ తుపాను ఎఫెక్ట్.. సముద్రంలో నిలిచిపోయిన ఫిలిప్పైన్స్ షిప్
ABN , Publish Date - Oct 29 , 2026 | 10:40 AM
‘ఆర్నబ్’ తుపాను దాటికి ఫిలిప్పైన్స్ దేశానికి చెందిన ఓ మర్చంట్ షిప్ అంతర్వేది వద్ద సముద్రంలో నిలిచిపోయింది. ఈ మేరకు షిప్‌లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కోస్ట్ గార్డ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.
పశ్చిమగోదావరి, అక్టోబర్ 29: ‘ఆర్నబ్’ తుపాను సృష్టించిన బీభత్సాన్ని ఫిలిప్పైన్స్‌కు చెందిన ఓ మర్చంట్ షిప్ కూడా తట్టుకోలేకపోయింది. తుపాను దాటికి షిప్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో అంతర్వేది వద్ద సముద్రంలో నిలిచిపోయింది. ఈ మేరకు సమాచారం అందుకున్న కోస్ట్ గార్డ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.
షిప్‌లో భారతీయులతో పాటు 24 మంది సిబ్బంది ఉన్నట్లుగా గుర్తించామని సంబంధిత అధికారులు వెల్లడించారు. తుపాను ప్రభావంతో షిప్‌లో సాంకేతిక లోపం తలెత్తినట్లు గుర్తించామన్నారు. ఈ మేరకు సాంకేతిక సమస్యను పరిష్కరించడానికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో షిప్‌లో చిక్కుకున్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. హెలికాప్టర్ సహాయంతో బాధితులను మొగల్తూరు హెలిప్యాడ్ వద్దకు తరలించేందుకు చర్యలు చేపట్టినట్లు కోస్ట్ గార్డ్ సిబ్బంది తెలిపారు.
ఇవి కూడా చదవండి...
చర్చల కోసం ఇరాన్ కీలక అధికారికి వాన్స్ లేఖ
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి గొట్టిపాటి పర్యటన.. విద్యుత్ పునరుద్ధరణకు ఆదేశాలు
Read Latest AP News And Telugu News