పెశారం ఎట్లుంది వొదినా..?
ABN , Publish Date - Oct 29 , 2026 | 12:04 PM
స్థానిక సంస్థల ఎన్నికల వేళ గ్రామాల్లో రాజకీయ చర్చలు జోరుగా సాగుతున్నాయి. పండితుడి నుంచి పామరుడి వరకు, పిల్లల నుంచి పెద్దల వరకు, ఇంటా, బయట, తోటల్లో ఎక్కడ చూసినా ఇదే చర్చ.
ధర్మవరం(అనంతపురం): స్థానిక సంస్థల ఎన్నికల వేళ గ్రామాల్లో రాజకీయ చర్చలు జోరుగా సాగుతున్నాయి. పండితుడి నుంచి పామరుడి వరకు, పిల్లల నుంచి పెద్దల వరకు, ఇంటా, బయట, తోటల్లో ఎక్కడ చూసినా ఇదే చర్చ. ఇద్దరు మహిళా కూలీల మధ్య జరిగిన చర్చ ఇలా..
మారెక్క: ఏం వొదినా..ఎలచ్చన్లు కదా. మీ సందులోకి ఎవురైనా పెశారానికి వొచ్చినారా?
లచ్చుమక్క: ఊనొదినా నిన్న, మొన్న తెలుగుదేశమోళ్లు, వైఎస్సారోళ్లు మా సందులోనే తిరుగుతాండ్రి. కనపడినోళ్లను ఓటేయమని అడుగుతాండ్రి.
మారెక్క: నిన్న సందకాడ మా సందులో కూడా గుంపులు గుంపులుగా మాట్లాడతాండ్రి.
లచ్చుమక్క: అది సర్లేగాని వొదినా ఎవురు గెలుత్తారంటావ్?
మారెక్క: అయ్యో.. నాకెట్ల తెలుత్తాది. అయినా ఇబ్బుడే ఎట్ల చెప్తాం.
లచ్చుమక్క: పైన సెంద్రబాబు ఉన్నాడు కదా..వాళ్లే పార్టీ వోళ్లే గెలుత్తారని అందురూ అంటాండారు. నువ్వేమంటావ్?
మారెక్క: ఎవుడన్నా గెలసనీలే గానీ దుడ్లు ఏమైనా ఇత్తారంటనా...
లచ్చుమక్క: అది ఏమో మడి. తాగేవాళ్లకు మాత్రం ఈ రొన్నాళ్లు పండగే.
మారెక్క: నిజిమే. మన్న నామినేషన్‌కు పొయ్యినబ్బుడే పిల్లపిల్ల నాయళ్లంతా తాగి ఊగుతాండ్రి.
లచ్చుమక్క: ఊనమ్మ బొలే అద్దమానం అయిపోయినారు పిల్లొళ్లు. పెద్దొళ్లు దండిత్తే కదా అద్దులో ఉండేది.
మారెక్క: నా మొగుడైతే సందకాడ బయటకు పోతే అర్ధరాత్రైనా ఇంటికిరాడు. ఆడే బొడ్రాయి అరుగుకాడ మగొళ్లంతా కుచ్చొని రాజకీయాలు మాట్లాడతాంటారు.
లచ్చుమక్క: మా ఇంట్లో ఏం తక్కవ కాదమ్మా...! మా ఆయప్ప అంతే. మనకేంటికి రాజకీయాలు తిని పనుకోరాదా అంటే మిందిమిందికి వత్తాడు. ఎలచ్చన్లు అయిపొయ్యేదాక వీళ్లనేం సేయలేం.
మారెక్క: అంతలక్క అట్టే ఉందిలే. సర్లేగాని మునుము అయిపోతాంది. నువ్వు పొయ్యి ఆ సద్ది తీసకరాపో ఆ యాపచెట్టుకింద కుచ్చొని ఇంత తిందాం ఆకిలైతాంది.
లచ్చుమక్క: సర్లే.. నీళ్ల బింది ఆడుంది. నువ్వు తీసకోనిరా.
ఈ వార్తలు కూడా చదవండి:
చనిపోయినా ఎంత బుజ్జిగున్నావ్ చిట్టితల్లీ
బహిరంగ మార్కెట్‌లోకి పంప్డ్ స్టోరేజీ విద్యుత్!
Read Latest AP News And Telangana News And International News And Telugu News