ప్రతీ క్షణం కీలకమే..
ABN , Publish Date - Oct 29 , 2026 | 11:26 AM
మెదడుకు రక్త సరఫరాలో అంతరాయం ఏర్పడినా, మెదడులో రక్తస్రావం జరిగినా ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది.
స్ట్రోక్ లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు..
సకాలంలో చికిత్సతో కోలుకునే అవకాశం
నేడు వరల్డ్ బ్రెయిన్ స్ట్రోక్ డే
కరీంనగర్: మెదడుకు రక్త సరఫరాలో అంతరాయం ఏర్పడినా, మెదడులో రక్తస్రావం జరిగినా ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. దీనినే బ్రెయిన్ స్ట్రోక్ అంటారు. స్ట్రోక్ లక్షణాలు కని పించిన వెంటనే సాధ్యమైనంత త్వరగా ఆసుపత్రికి చేరుకోవడం అత్యంత కీలకం. చికిత్స అందడంలో ఆలస్య మైతే మెదడుకు తీవ్రమైన నష్టం జరిగి శాశ్వత పక్షవాతానికి దారితీస్తుంది.
మన దేశంలో ప్రతి సంవత్సరం లక్షలాది మంది బ్రెయిన్ స్ట్రోక్ బారి న పడుతున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖం ఒక వైపు వాలిపోవ డం, చేయి లేదా కాలు అక స్మాత్తుగా బల హీనపడటం, మాట తడబడడం, చూపులో మార్పులు రావడం వంటి లక్ష ణాలను సాధారణ నీరసంగా భావించి నిర్ల క్ష్యం చేయవద్దు. రాత్రి సమయంలో ఈ లక్షణాలు కనిపించినా ఉదయం వరకు వేచి చూ డకుండా తక్షణమే వైద్య సహాయం పొందాలని సూచిస్తున్నారు. అక్టోబరు 29న వరల్డ్ బ్రె యిన్ స్ట్రోక్ డేను నిర్వహిస్తారు.. ఈ సంద ర్భంగా బ్రెయిన్‌స్ట్రోక్‌పై అవగాహన కల్పిస్తారు.
గోల్డెన్ అవర్‌ను కోల్పోవద్దు...
రక్తనాళంలో రక్తం గడ్డకట్టడం వల్ల వచ్చే ఇస్కీమిక్ స్ట్రోక్‌కు థ్రాంబో లైటిక్ చికిత్స అందించడం ద్వారా రక్తప్రసరణను పునరుద్ధరించే అవకా శం ఉంటుంది. కొందరికి రక్తనాళంలో గడ్డను తొలగించే ప్రత్యేక చికిత్స కూడా అవసరమవుతుంది. ఏ చికిత్స అందిం చాలనేది బ్రెయిన్ స్కాన్, లక్షణాలు ప్రారంభ మైన సమయం, రోగి ఆరోగ్య పరిస్థితిని బట్టి వైద్యులు నిర్ణయిస్తారు.
బీపీ, షుగర్ ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలి
అధిక రక్తపోటు, మధు మేహం, అధిక కొలెస్ట్రాల్, ధూమపానం, అధిక మద్య పానం, కొన్ని గుండె సం బంధిత సమస్యలు స్ట్రోక్ ముప్పును పెంచుతాయి. వీటిని నియంత్రించ డంతో పాటు క్రమం తప్పకుండా ఆరోగ్య ప రీక్షలు చేయించు కోవ డం, వైద్యుల సూచ నల ప్రకారం మందులు వాడ డం ద్వారా స్ట్రోక్ ప్రమా దాన్ని తగ్గిం చుకోవచ్చు.
చికిత్సతో పాటు థెరపీలూ ముఖ్యం
స్ట్రోక్ వచ్చిన తర్వాత ప్రాణాలను కాపాడటంతో పాటు రోగి తిరిగి సాధ్య మైనంత సాధారణ జీవితం గడిపేలా చేయడం ముఖ్య మే. ఫిజియోథెరపీ, ఆక్యుపేష నల్ థెరపీ, అవసరమైన స్పీచ్ థెరపీతో రోగి కదలికలు, మాట, రోజు వారీ పనులు చేసుకునే సామర్థ్యం మెరు గుపడే అవకాశం ఉంటుంది
లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు..
డాక్టర్ సంజయ్ కామిన్వార్, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ న్యూరాలజిస్ట్
బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. లక్షణాలను కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించి నట్లైతే చికిత్స అందుతుంది. దీంతో పక్షవాతం నుంచి బయట పడవచ్చు. బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలను ఇతర జబ్బులతో పోల్చుకోని ఇంట్లోనే ఉండి పోకూడదు.
ఈ వార్తలు కూడా చదవండి:
చనిపోయినా ఎంత బుజ్జిగున్నావ్ చిట్టితల్లీ
బహిరంగ మార్కెట్‌లోకి పంప్డ్ స్టోరేజీ విద్యుత్!
Read Latest AP News And Telangana News And International News And Telugu News