పోలీసులనే భయపెట్టి.. మహిళా ఎస్‌ఐని చుట్టుముట్టి!
ABN , Publish Date - Jul 31 , 2026 | 07:33 AM
వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శ్రీకాకుళం పర్యటన పోలీసులనే భయపెట్టేలా సాగింది. జగన్ వెంట వచ్చిన వైసీపీ నేతలు, కార్యకర్తలు నిబంధనలను ఏ మాత్రం పట్టించుకోలేదు.
జగన్ సిక్కోలు పర్యటనలో అరాచకం
బైక్‌లను అడ్డుకున్న ఎస్‌ఐ ప్రవల్లికపై దౌర్జన్యం
ఆమెను చుట్టుముట్టిన చింతాడ రవి, అనుచరులు
దాడి యత్నంతో భయాందోళనకు గురైన ఎస్‌ఐ
శ్రీకాకుళం, జూలై 30 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శ్రీకాకుళం పర్యటన పోలీసులనే భయపెట్టేలా సాగింది. జగన్ వెంట వచ్చిన వైసీపీ నేతలు, కార్యకర్తలు నిబంధనలను ఏ మాత్రం పట్టించుకోలేదు. బారికేడ్లతోపాటు... అడ్డొచ్చిన పోలీసులనూ తోసేశారు. ఒక మహిళా ఎస్‌ఐని చుట్టుముట్టి... ఆమెపై దాడి చేసినంత పని చేశారు. అసలు జగన్‌తోపాటు ర్యాలీగా జనం వచ్చేందుకే అనుమతి లేదు. అయినా... పెద్దసంఖ్యలో బైకులపై కార్యకర్తలు తరలి వచ్చారు. శ్రీకాకుళం నుంచి జిల్లా జైలుకు వెళ్లే మార్గంలో... హైవేను ఆనుకుని ఉన్న ఫ్లైఓవర్ వద్ద పోలీసులు బైకులను అడ్డుకున్నారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న బూర్జ పోలీసు స్టేషన్ ఎస్‌ఐ ప్రవల్లిక ఒక బైకును ఆపగా... ఆమదాలవలస వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి చింతాడ రవికుమార్, ఆయన అనుచరులు ఒక్కసారిగా రెచ్చిపోయారు.
మహిళా ఎస్‌ఐని అందరూ చుట్టుముట్టి... తోసుకుంటూ వెళ్లారు. కొంతమంది కార్యకర్తలు వికృతంగా ప్రవర్తించారు. దీంతో ఆమె భయాందోళనకు గురయ్యారు. ఈలోపు సహచర పోలీసులు అక్కడకు వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇక అంపోలు జిల్లా జైలుకు వెళ్లే మార్గంలో పోలీసులపై కొందరు కార్యకర్తలు రాళ్లు రువ్వారు. దీంతో తప్పని పరిస్థితిలో పోలీసులు లాఠీచార్జి చేశారు. మహిళా ఎస్‌ఐ పట్ల అనుచితంగా ప్రవర్తించిన వాళ్లందరినీ గుర్తించే పనిలో జిల్లా పోలీసులు నిమగ్నమయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలను పరిశీలిస్తున్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ కూడా ఈ అంశాన్ని సీరియ్‌సగా తీసుకుంది.
వార్తలు కూడా చదవండి...
హిందుత్వం అంటే మతం కాదు జీవన విధానం: వెంకయ్యనాయుడు
గాదె సాయి కృష్ణ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం.. వారం రోజుల కస్టడీకి మాజీ సీఐ నాగరాజు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News
వార్తలు కూడా చదవండి...
హిందుత్వం అంటే మతం కాదు జీవన విధానం: వెంకయ్యనాయుడు
గాదె సాయి కృష్ణ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం.. వారం రోజుల కస్టడీకి మాజీ సీఐ నాగరాజు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News