పంట నష్టాల అంచనాలు తక్షణమే పూర్తి చేయాలి: మంత్రి అచ్చెన్నాయుడు
ABN , Publish Date - Sep 25 , 2026 | 11:28 AM
పంట నష్టాల అంచనాలు తక్షణమే పూర్తి చేయాలని ఏపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. భారీ వర్షాలతో దెబ్బతిన్న పంటలపై వెంటనే క్షేత్రస్థాయి సర్వే చేపట్టాలని సూచించారు.
శ్రీకాకుళం జిల్లా, సెప్టెంబర్ 25 (ఆంధ్రజ్యోతి): పంట నష్టాల అంచనాలు తక్షణమే పూర్తి చేయాలని ఏపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (AP Minister Atchannaidu) ఆదేశించారు. భారీ వర్షాలతో దెబ్బతిన్న పంటలపై వెంటనే క్షేత్రస్థాయి సర్వే చేపట్టాలని సూచించారు. పంట నష్టాల నమోదు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు. ఈరోజు (శుక్రవారం) శ్రీకాకుళం జిల్లాలోని సంతబొమ్మాళి మండలంలో మంత్రి అచ్చెన్నాయుడు పర్యటించారు. తీవ్రవాయుగుండం ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి విస్తృతంగా పర్యటించారు. వడ్డీవాడ, అంట్లవరం, వడ్డీతాండ్రా, సంతబొమ్మాళిలో ముంపు ప్రాంతాలను పరిశీలించారు. ముంపునకు గురైన పంట పొలాలను స్వయంగా పరిశీలించి అధికారులతో మాట్లాడారు. రైతులతో నేరుగా మాట్లాడి పంట నష్టంపై వివరాలు తెలుసుకున్నారు. గోదలాం, కొల్లిపాడు, లక్కీవలస, మారువాడ, మేఘవరం వరకు ముంపు ప్రాంతాలను పరిశీలించారు.
రహదారులకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలి..
రహదారులు, పంచాయతీరాజ్, వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. దెబ్బతిన్న రహదారులకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. ముంపునకు గురైన పంట పొలాలను గుర్తించి నష్ట వివరాలు నమోదు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేయాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలని సూచించారు. నీరు నిలిచిన పొలాలను వెంటనే పరిశీలించాలని వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు.
అధికారులు సమన్వయంతో పనిచేయాలి..
నిల్వ నీటిని తొలగించి అధిక తేమతో రైతన్నలకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. పంటల రక్షణకు అవసరమైన సాంకేతిక సూచనలు అన్నదాతలకు నేరుగా అందించాలని ఆదేశించారు. వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, మత్స్య శాఖలు సమన్వయంతో పనిచేయాలని నిర్దేశించారు. ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వర్షపు నీటి సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. భవిష్యత్తు సాగు అవసరాలకు వర్షపు నీటిని సమర్థంగా వినియోగించుకోవాలని నిర్దేశించారు. పంటల రక్షణ, నష్టాల అంచనా, నీటి సంరక్షణపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి అచ్చెన్నాయుడు మార్గనిర్దేశం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తీవ్ర వాయుగుండం.. 24x7 అత్యంత అప్రమత్తంగా ఉండాలి: మంత్రి జనార్దన్ రెడ్డి
వివేకా కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం.. వారికి నోటీసులు
వైసీపీకి భారీ షాక్.. కీలక నేతల రాజీనామా
Read Latest AP News And Telangana News And National News
And Telugu News