వైసీపీకి భారీ షాక్.. కీలక నేతల రాజీనామా
ABN , Publish Date - Sep 24 , 2026 | 12:39 PM
అనకాపల్లి జిల్లాలోని సబ్బవరంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. జగన్ పార్టీకి పలువురు నేతలు రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు.
అనకాపల్లి జిల్లా, సెప్టెంబర్ 24 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి జిల్లాలోని సబ్బవరంలో వైసీపీ (YSRCP)కి భారీ షాక్ తగిలింది. జగన్ పార్టీకి పలువురు నేతలు రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. మాజీ సర్పంచ్ బోకం సూర్యనాయుడు, ఎంపీటీసీ బోకం గోపాలకృష్ణ పసుపు కండువా కప్పుకున్నారు. 200 మంది అనుచరులతో కలిసి వైసీపీని వీడి టీడీపీలో చేరారు.
టీడీపీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్య బాబు, ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్, పెందుర్తి ఇన్‌చార్జ్ గండి బాబ్జి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. టీడీపీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పాలనకు ఆకర్షితులై పార్టీలో చేరామని నాయకులు తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పనిచేసి కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గండి బాబ్జి పిలుపునిచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తుఫాన్ వేళ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలి: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్
భారీ వర్షాల వేళ విజయవాడ కొండ ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి: మంత్రి నారాయణ
తుఫాన్ వేళ ప్రజా రవాణాకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలి: మంత్రి జనార్దన్ రెడ్డి
Read Latest AP News And Telangana News And National News
And Telugu News