Share News

నంద్యాల జిల్లాలో టీడీపీ కేడర్‌పై రెచ్చిపోయిన వైసీపీ శ్రేణులు.. నలుగురికి గాయాలు

ABN , Publish Date - Nov 22 , 2026 | 08:20 PM

నంద్యాల జిల్లా చాగలమర్రి మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. కర్రలు, బీరు బాటిళ్లతో విచక్షణారహితంగా దాడి చేశాయి. ఈ ఘటనలో నలుగురు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి.

నంద్యాల జిల్లాలో టీడీపీ కేడర్‌పై రెచ్చిపోయిన వైసీపీ శ్రేణులు.. నలుగురికి గాయాలు
Nandyal YSRCP Incident

నంద్యాల జిల్లా, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లా చాగలమర్రి మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. కర్రలు, బీరు బాటిళ్లతో విచక్షణారహితంగా దాడి చేశాయి. ఈ ఘటనలో నలుగురు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. గాయాలైన వారిని కడప ఆస్పత్రికి తరలించి, వైద్యం అందిస్తున్నారు. అయితే, చాగలమర్రిలో వైసీపీకి చెందిన 150 కుటుంబాల్లోని వారు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సమక్షంలో టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు.


చాగలమర్రికి అఖిలప్రియ వస్తోండటంతో పూల దండలు కొనేందుకు టీడీపీ కార్యకర్తలు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. వైసీపీ శ్రేణుల దాడిని ఎమ్మెల్యే అఖిలప్రియ తీవ్రంగా ఖండించారు. వైసీపీకి చెందిన 150 కుటుంబాలు టీడీపీలో చేరడాన్ని జీర్ణించుకోలేక కొందరు వైసీపీ శ్రేణులు తమ కార్యకర్తల మీద దాడికి దిగాయని ధ్వజమెత్తారు. టీడీపీ కార్యకర్తల మీద దాడి చేసిన వైసీపీ కార్యకర్తలు మర్యాదగా పోలీస్ స్టేషన్‌లో లొంగిపోవాలని అన్నారు. లేకపోతే తమ వాళ్లను ఆపడం తనవల్ల కూడా కాదని ఎమ్మెల్యే అఖిల ప్రియ స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

స్థానిక ఎన్నికల్లో 90 శాతం పైగా స్ట్రైక్ రేట్ సాధించాం: సీఎం చంద్రబాబు

ప్రకాశం జిల్లా ప్రమాదంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ దిగ్భ్రాంతి

అమరావతిని బెస్ట్ క్యాపిటల్‌గా తీర్చిదిద్దుతున్నాం: సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 22 , 2026 | 08:40 PM