రాజ్యసభలో వైవీ సుబ్బారెడ్డి రభస
ABN , Publish Date - Jul 31 , 2026 | 08:55 AM
రాజ్యసభలో ఏపీ మెగా డీఎస్సీ అంశాన్ని ప్రస్తావించి రభస చేయడానికి వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రయత్నించారు. గురువారం రాజ్యసభలో యాంటీ పేపర్ లీక్ బిల్లుపై చర్చ జరగగా వైసీపీ తరఫున వైవీ సుబ్బారెడ్డి మాట్లాడారు.
మెగా డీఎస్సీ అంశం ప్రస్తావనకు వైసీపీ ఎంపీ ప్రయత్నం
అడ్డుకున్న డిప్యూటీ చైర్మన్, టీడీపీ ఎంపీ సానా సతీశ్
న్యూఢిల్లీ, జూలై 30(ఆంధ్రజ్యోతి): రాజ్యసభలో ఏపీ మెగా డీఎస్సీ అంశాన్ని ప్రస్తావించి రభస చేయడానికి వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రయత్నించారు. గురువారం రాజ్యసభలో యాంటీ పేపర్ లీక్ బిల్లుపై చర్చ జరగగా వైసీపీ తరఫున వైవీ సుబ్బారెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీలో డీఎస్సీని ప్రస్తావించే ప్రయత్నం చేయగా, ఈ సమయంలో సభా అధ్యక్ష స్థానంలో ఉన్న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్.. వైవీని అడ్డుకున్నారు. ఇది జాతీయ స్థాయికి సంబంధించిన పేపర్ లీక్ బిల్లు అని, దీనిపై మాత్రమే మాట్లాడాలని ఆయన స్పష్టం చేశారు. ఇదే సమయంలో టీడీపీ ఎంపీ సానా సతీశ్ కూడా వైవీ సుబ్బారెడ్డి ప్రసంగాన్ని నిలువరించే ప్రయత్నం చేశారు. బిల్లుకు సంబంధం లేకుండా మాట్లాడిన అంశాలను రికార్డుల్లోకి తీసుకోబోమని డిప్యూటీ చైర్మన్ తేల్చిచెప్పారు. సబ్జెక్టుపైనే మాట్లాడాలని ఆయన గట్టిగా చెప్పడంతో చివరకు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తన ప్రసంగాన్ని ముగించారు.
వార్తలు కూడా చదవండి...
హిందుత్వం అంటే మతం కాదు జీవన విధానం: వెంకయ్యనాయుడు
గాదె సాయి కృష్ణ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం.. వారం రోజుల కస్టడీకి మాజీ సీఐ నాగరాజు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News