వైసీపీని వీడని నంబర్-11..!
ABN , Publish Date - Mar 24 , 2026 | 02:49 PM
ఢిల్లీలోని పార్లమెంటు భవనంలో గదుల కేటాయింపు వ్యవహారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ముఖ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, 11 అనే సంఖ్యకు మధ్య ఉన్న విచిత్రమైన సంబంధం ఈ ఘటనతో మరోసారి వార్తల్లోకి ఎక్కింది.
ఢిల్లీ, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీలోని పార్లమెంటు భవనంలో గదుల కేటాయింపు వ్యవహారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ముఖ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP)కి 11 అనే సంఖ్యకు మధ్య ఉన్న విచిత్రమైన సంబంధం ఈ ఘటనతో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.
బలాబలాల ఆధారంగా నంబర్ల కేటాయింపు..
కొత్త పార్లమెంటు భవనంలో ఆయా పార్టీల బలాబలాలను చూసి స్పీకర్ కార్యాలయం గదులను కేటాయిస్తుంది. అయితే వైసీపీ ఎంపీలకు కేటాయించిన గది నంబర్ వారిని తీవ్ర కలవరానికి గురిచేసింది. స్పీకర్ కార్యాలయం మొదట వైసీపీకి మొదటి అంతస్తులో 11వ నంబర్ గదిని కేటాయించింది. ఈ నంబర్ చూడగానే వైసీపీ ఎంపీలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. సోషల్ మీడియాలో నెటిజన్లు వైసీపీని 11 అంటూ ఎద్దేవా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు పార్లమెంటులో కూడా అదే నంబర్ రావడం ఫ్యాన్ పార్టీ నేతలను విస్మయానికి గురిచేసింది.
స్పీకర్‌తో భేటీ.. స్పీకర్ ఆశ్చర్యం..
తమకు ఇచ్చిన గది నంబర్ మార్చాలని కోరుతూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ ఎంపీలు హుటాహుటిన స్పీకర్‌ను కలిశారు. 11వ నంబర్ గదిని ఎందుకు వద్దంటున్నారని స్పీకర్ ప్రశ్నించగా.. ఆ నంబర్ తమకు కలిసి రావడం లేదని, ఏపీలో తమ పార్టీ గెలిచిన సీట్ల సంఖ్య కూడా అదే కావడంతో అందరూ హేళన చేస్తున్నారని ఫ్యాన్ పార్టీ నేతలు వివరించారు.
గది నంబర్ మార్పు..
ఆ పార్టీ ఎంపీల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న స్పీకర్, వారికి 12వ నంబర్ గదిని కేటాయించారు. దీంతో వైసీపీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. రాజకీయాల్లో సంఖ్యాశాస్త్రం సెంటిమెంట్లకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో ఈ ఘటన మరోసారి నిరూపిస్తోంది. ఒకప్పుడు 151 సీట్లతో రికార్డు సృష్టించిన పార్టీ, ఇప్పుడు 11 అనే అంకెను చూసి భయపడటం విచిత్రమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
టీడీపీకి 9వ నంబర్..
మరోవైపు, ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ (TDP)కి పార్లమెంటు మొదటి అంతస్తులో 9వ నంబర్ గదిని కేటాయించారు. కూటమి ప్రభుత్వంలో టీడీపీ కీలక పాత్ర పోషిస్తోండటంతో, ప్రధానమైన గదుల్లో ఒకటి వారికి దక్కింది.
ఈ వార్తలు కూడా చదవండి..
మంత్రి లోకేశ్ ప్రజాదర్బార్.. జాబ్ క్యాలెండర్, ఉద్యోగ సమస్యలపై వినతులు
అమరావతిలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఐకానిక్ కట్టడాలు: మంత్రి నారాయణ
నా కుమారుడు మహేశ్ యాదవ్‌కు ఎలాంటి డ్రగ్స్ అలవాట్లు లేవు: పుట్టా సుధాకర్
Read Latest AP News And Telangana News And International News And Telugu News