Share News

జగన్ హయాంలో ప్రజావ్యతిరేక సంస్కృతి పెరిగింది: పెమ్మసాని

ABN , Publish Date - May 14 , 2026 | 02:45 PM

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో ప్రజావ్యతిరేక సంస్కృతి పెరిగిందని ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలను పట్టించుకోలేదని ఆగ్రహించారు.

జగన్ హయాంలో ప్రజావ్యతిరేక సంస్కృతి పెరిగింది: పెమ్మసాని
Pemmasani Chandrasekhar

గుంటూరు జిల్లా, మే14 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ (Pemmasani Chandrasekhar) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో ప్రజావ్యతిరేక సంస్కృతి పెరిగిందని ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలను పట్టించుకోలేదని ఆగ్రహించారు. ఈరోజు (గురువారం) గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నసీర్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెమ్మసాని చంద్రశేఖర్, జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు, టీడీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడారు.


టీడీపీని చంద్రబాబు నిబద్దతతో నడిపిస్తున్నారు..

ఒక వ్యక్తి హృదయ స్పందన నుంచి పుట్టిన పార్టీ తెలుగుదేశం అని అభివర్ణించారు. పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం టీడీపీ ఏర్పడిందని తెలిపారు. 40 ఏళ్లుగా చంద్రబాబు పార్టీని నిబద్దతతో నడిపిస్తున్నారని కొనియాడారు. కార్యకర్తలకు నిరంతరం టీడీపీ హైకమాండ్ అందుబాటులో ఉండి వారికి సహాయపడుతోందని చెప్పుకొచ్చారు. పనిచేసే కార్యకర్తలు అందరికీ పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందని తెలిపారు. స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ద్వారా కార్యకర్తలను ఆర్థికంగా స్థిరపడే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా అధికారంలోకి టీడీపీ వస్తే గుంటూరు నగరాన్ని అమెరికా స్థాయిలో అభివృద్ధి చేస్తామని తెలిపారు. తెలుగుదేశం పార్టీని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి కార్యకర్తపైన ఉందని పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

దుబారా ఖర్చులను తగ్గిద్దాం.. సీఎం చంద్రబాబు పిలుపు

ఆంధ్రప్రదేశ్‌లో డిజిటల్ విప్లవానికి శ్రీకారం.. భారత్‌నెట్ అమలుకు చరిత్రాత్మక ఒప్పందం

నా కస్టోడియల్ టార్చర్ కేసును వదిలే ప్రసక్తే లేదు: రఘురామ

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 14 , 2026 | 02:56 PM