స్థానిక ఎన్నికలపై పవన్ కల్యాణ్ స్పెషల్ ఫోకస్
ABN , Publish Date - Oct 09 , 2026 | 03:46 PM
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల కోసం జనసేన పార్టీ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. 25 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో అడ్‌హాక్ కమిటీల ఏర్పాటుతో పాటు ఎన్నికల నిర్వహణ, కూటమి సమన్వయం, ప్రచారం, ఆర్థిక వ్యవహారాల పర్యవేక్షణకు మరో నాలుగు కేంద్ర కమిటీలను నియమించింది. కమిటీల పనితీరును డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వయంగా పర్యవేక్షించనున్నారు.
అమరావతి, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన హై కమాండ్ ప్రత్యేకంగా దృష్టిసారించింది. ఈ ఎన్నికల కోసం 25 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో అడ్‌హాక్ కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ మేరకు పార్టీ హై కమాండ్ ఈరోజు (శుక్రవారం) ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ కమిటీల పనితీరును ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) స్వయంగా పర్యవేక్షించనున్నారు. క్షేత్రస్థాయిలో సమాచార సేకరణకు ఆ కమిటీలకు ఆదేశాలు ఇవ్వనున్నారు. విజయవాడ పార్లమెంట్ మినహా మిగతా పార్లమెంట్ కమిటీలను ఏర్పాటు చేశారు.
ఇందులో భాగంగానే త్వరలో పార్లమెంట్ నియోజకవర్గాల కమిటీలతో పవన్ కల్యాణ్ సమావేశం కానున్నారు. జనసేన సంస్థాగత బలోపేతం, ఎన్నికల సన్నద్ధతపై ప్రత్యేకంగా దృష్టిసారించనున్నారు. ఈ ఎన్నికల కోసం మరో నాలుగు కేంద్ర కమిటీలను నియమించింది.
స్థానిక ఎన్నికల నిర్వహణ, మార్గదర్శక కమిటీలను ఏర్పాటు చేశారు. కూటమి సమన్వయం కోసం ప్రత్యేక కమిటీని నియమించారు. ఎన్నికల ప్రచార నిర్వహణకు ప్రచార కమిటీని ఏర్పాటు చేశారు. జనసేన ఆర్థిక వ్యవహారాల పర్యవేక్షణకు ట్రెజరీ కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు జనసేన హై కమాండ్ ప్రకటించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
భారత్‌ను మరింత ఉన్నతస్థాయికి మోదీ తీసుకెళ్తున్నారు: లోకేశ్
భోగాపురంతో ఉత్తరాంధ్ర మినీ ఎకనామిక్ సిటీగా మారుతుంది: రామ్మోహన్
హరితాంధ్రప్రదేశ్ నిర్మాణానికి రైతుల భాగస్వామ్యం కీలకం: నాగబాబు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News