Share News

హరితాంధ్రప్రదేశ్‌ నిర్మాణానికి రైతుల భాగస్వామ్యం కీలకం: నాగబాబు

ABN , Publish Date - Oct 07 , 2026 | 06:49 PM

హరితాంధ్రప్రదేశ్‌పై ఏపీ గ్రీన్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఛైర్మన్‌ నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. హరితాంధ్రప్రదేశ్‌ నిర్మాణానికి కడియం నర్సరీ రైతుల భాగస్వామ్యం ఎంతో కీలకమని వ్యాఖ్యానించారు.

 హరితాంధ్రప్రదేశ్‌ నిర్మాణానికి రైతుల భాగస్వామ్యం కీలకం: నాగబాబు
Nagababu

రాజమహేంద్రవరం, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): హరితాంధ్రప్రదేశ్‌పై ఏపీ గ్రీన్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఛైర్మన్‌ నాగబాబు (Nagababu) కీలక వ్యాఖ్యలు చేశారు. హరితాంధ్రప్రదేశ్‌ నిర్మాణానికి కడియం నర్సరీ రైతుల భాగస్వామ్యం ఎంతో కీలకమని వ్యాఖ్యానించారు. ఈరోజు (బుధవారం) రాజమహేంద్రవరం కడియంలోని సర్‌ ఆర్థర్‌ కాటన్‌ నర్సరీ ఫార్మర్స్‌ అసోసియేషన్‌ రైతుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నాగబాబు పాల్గొన్నారు.


రాజమహేంద్రవరం పుష్కర నగరవనంలో రుద్రాక్ష మొక్కలతోపాటు అత్యంత అరుదైన అండమాన్‌ పడాక్‌ మొక్కలను నాటారు. కడియం నర్సరీలను పరిశీలించారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడారు. రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడమే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ధ్యేయమని ఉద్ఘాటించారు. నర్సరీ రైతులకు స్థిరమైన మార్కెట్‌ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. 2026–27 ఆర్థిక సంవత్సరంలో సుమారు 10 కోట్ల మొక్కలను నర్సరీల్లో సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 500 నుంచి 1,000 నర్సరీలు అవసరమని నాగబాబు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అమరావతి పనుల్లో వేగం పెంచాలి.. ప్రతి నెల రూ. 2వేల కోట్ల పనులు పూర్తి చేయాలి: సీఎం

టీటీడీ భక్తులకు అలర్ట్.. ఆ రోజుల్లో VIP దర్శనాలు రద్దు

‘స్త్రీశక్తి’ 100 కోట్లకు పైగా ప్రయాణాలు పూర్తి చేసుకోవడం గర్వకారణం: సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Oct 07 , 2026 | 07:06 PM