Share News

భోగాపురంతో ఉత్తరాంధ్ర మినీ ఎకనామిక్ సిటీగా మారుతుంది: రామ్మోహన్

ABN , Publish Date - Oct 07 , 2026 | 03:12 PM

ఉత్తరాంధ్ర ప్రాంతం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంతో మినీ ఎకనామిక్ సిటీగా తయారవుతుందని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు. ఈ ప్రాంతంలో వలసలు ఇంకా ఉన్నాయని.. వాటిని రూపుమాపుతామనిపేర్కొన్నారు.

 భోగాపురంతో ఉత్తరాంధ్ర మినీ ఎకనామిక్ సిటీగా మారుతుంది: రామ్మోహన్
Ram Mohan Naidu

విశాఖపట్నం, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్ర ప్రాంతం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంతో మినీ ఎకనామిక్ సిటీగా తయారవుతుందని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు (Ram Mohan Naidu) వ్యాఖ్యానించారు. ఈ ప్రాంతంలో వలసలు ఇంకా ఉన్నాయని.. వాటిని రూపుమాపుతామని పేర్కొన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టు ఏపీకి ఫ్రైడ్‌గా ఉందని వివరించారు. ఉత్తరాంధ్రలో అనేక వనరులు ఉన్నాయని వెల్లడించారు. ఈరోజు ( బుధవారం) విశాఖపట్నంలో రామ్మోహన్ పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రెండున్నరేళ్లలో రూ. 14 లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీకి వచ్చాయని తెలిపారు. 216 ప్రాజెక్టులు రాష్ట్రానికి వచ్చాయని ప్రస్తావించారు. గూగుల్ 2.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఉత్తరాంధ్రలో పెడుతుందని చెప్పుకొచ్చారు. ఫాస్టెస్ట్ గవర్నమెంట్‌గా ఏపీ పనిచేస్తోందని ఉద్ఘాటించారు.


ప్రతి 45 రోజులకు ఓ ఎయిర్‌పోర్టును ప్రారంభిస్తున్నాం..

12 నెల్లలోనే పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నామని రామ్మోహన్ స్పష్టం చేశారు. ఇప్పటివరకు రూ.22 వేల కోట్ల పెట్టుబడులకు అనుమతులు ఇచ్చామని వెల్లడించారు. దేశంలో ప్రతి 45 రోజులకు ఓ ఎయిర్‌పోర్టును ప్రారంభిస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో శ్రీకాకుళం, కుప్పం, నాగార్జున సాగర్, అమరావతిలలో ఎయిర్‌పోర్టులను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. మంత్రి నారా లోకేశ్ అనేక ఉద్యోగాలకు రూపకల్పన చేస్తున్నారని వివరించారు. ఉత్తరాంధ్రకు అనేక పరిశ్రమలు వస్తున్నాయని తెలిపారు. నక్కపల్లిలో స్టీల్ ప్లాంట్ వస్తోందని అన్నారు. ప్రస్తుతం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ జరుగుతోందని చెప్పారు. సింగిల్ విండో ద్వారా అనుమతులు ఇస్తున్నామని స్పష్టం చేశారు. 28 పరిశ్రమల స్థాపనకు అనుమతి ఇచ్చామని ప్రస్తావించారు. 52 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థతో 11 జిల్లాల పరిధిలో విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్‌ను ఏర్పాటు చేస్తామని కేంద్రమంత్రి తెలిపారు.


ప్రతి ఒక్కరూ పెట్టుబడిదారులుగా మారాలి..

ప్రధానమంత్రి నరేంద్రమోదీ 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని పూర్తి చేసుకునందుకు గాను రామ్మోహన్ ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మంచి మైత్రి సంబంధాలు బాగున్నాయని ఉద్ఘాటించారు. విశాఖపట్నం వేదికగా దక్షిణ కోస్తా రైల్వేజోన్ ఏర్పాటైందని వెల్లడించారు. ఎయిర్‌పోర్టుల విషయంలో భారత్ లాగా మరే దేశంలో ఇంత స్పీడ్‌గా డెవలప్ కావట్లేదని చెప్పారు. కుప్పం, శ్రీకాకుళంలో విమానాశ్రయాలు వస్తున్నాయని... ల్యాండ్ క్లియరెన్స్ అయిపోయిందని తెలిపారు. ఏపీలో ఉన్న ప్రతి ఒక్కరూ పెట్టుబడిదారులుగా మారి యువతకు ఉపాధిని కల్పించాలని సూచించారు. మీ పెట్టుబడి మా పెట్టుబడిగా భావిస్తున్నామని వెల్లడించారు. ఈ దశాబ్దంలో ఎన్ని క్రైసిస్ వచ్చిన రాష్ట్రం ప్రగతి పథంలో ముందుకెళ్తుందని ఉద్గాటించారు. దేశమే కాదని.. ఏపీ కూడా అభివృద్ధిలో ముందుకెళ్తుందని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అమరావతి పనుల్లో వేగం పెంచాలి.. ప్రతి నెల రూ. 2వేల కోట్ల పనులు పూర్తి చేయాలి: సీఎం

టీటీడీ భక్తులకు అలర్ట్.. ఆ రోజుల్లో VIP దర్శనాలు రద్దు

‘స్త్రీశక్తి’ 100 కోట్లకు పైగా ప్రయాణాలు పూర్తి చేసుకోవడం గర్వకారణం: సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Oct 07 , 2026 | 03:58 PM