స్థానిక ఎన్నికలపై సుప్రీంకోర్టులో కీలక మలుపు.. కేవియట్ దాఖలు చేసిన ఏపీ సర్కార్
ABN , Publish Date - Oct 07 , 2026 | 06:06 PM
స్థానిక సంస్థల ఎన్నికలను నిలిపేయాలని వైసీపీ దాఖలు చేసిన పిటిషన్‌పై తమ వాదనలు పరిగణనలోకి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో కేవియట్‌ను కూటమి సర్కార్ దాఖలు చేసింది.
ఢిల్లీ, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలను నిలిపేయాలని వైసీపీ దాఖలు చేసిన పిటిషన్‌పై తమ వాదనలు పరిగణనలోకి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో కేవియట్‌ను కూటమి సర్కార్ దాఖలు చేసింది. ఏపీలో 'సర్' ప్రక్రియ పూర్తి కాకుండానే స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమైందని వైసీపీ పిటిషన్‌లో తెలిపింది. గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో జనవరిలో ఉన్న డేటానే పరిగణనలోకి ప్రభుత్వం తీసుకుందని వైసీపీ ఆరోపించింది.
ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై ఈనెల(అక్టోబరు) 1వ తేదీన తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. వార్డుల విభజనను చేసుకోవచ్చని, స్థానిక ఎన్నికలు నిర్వహించవచ్చని ప్రభుత్వానికి అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చింది. హైకోర్టు ఎన్నికల నిర్వహణకు పచ్చజండా ఊపడంపై సుప్రీంకోర్టులో వైసీపీ పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ వైసీపీ దాఖలు చేసిన పిటిషన్‌లో తమ వాదనలు వినాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఆ తర్వాతే తగిన ఆదేశాలు ఇవ్వాలని ఏపీ సర్కార్ కేవియట్ దాఖలు చేసింది. సోమవారం పిటిషన్ దాఖలు చేసి.. వెంటనే సీజేఐ కోర్టులో వైసీపీ తరపు న్యాయవాది మెన్షన్ చేశారు.
ఏపీలో ఏ క్షణంలోనైనా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడానికి అవకాశం ఉందని న్యాయవాది తెలిపారు. వెంటనే ఈ విషయంపై విచారణ చేపట్టాలని కోరారు. అయితే, ఈ విషయాన్ని పూర్తిగా పరిశీలిద్దామని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. 'సర్' ప్రక్రియ మొత్తం ముగిసిన తర్వాతే... స్థానిక ఎన్నికలను నిర్వహించేలా ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో వైసీపీ తరపు న్యాయవాది పేర్కొన్నారు. ‘వార్డుల సరిహద్దులు ఫ్రీజ్ కావు’ అని మెన్షన్ చేసిన సమయంలో సుప్రీంకోర్టు ఈ మేరకు వ్యాఖ్యానించింది. మున్సిపాలిటీ సరిహద్దుల ‘ఫ్రీజింగ్’ వార్డులకు వర్తించదని మెన్షన్ సమయంలో ధర్మాసనంలో న్యాయమూర్తి జస్టిస్ జోయ్‌మల్యా బాగ్చీ స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అమరావతి పనుల్లో వేగం పెంచాలి.. ప్రతి నెల రూ. 2వేల కోట్ల పనులు పూర్తి చేయాలి: సీఎం
టీటీడీ భక్తులకు అలర్ట్.. ఆ రోజుల్లో VIP దర్శనాలు రద్దు
‘స్త్రీశక్తి’ 100 కోట్లకు పైగా ప్రయాణాలు పూర్తి చేసుకోవడం గర్వకారణం: సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News