Share News

భారత్‌ను మరింత ఉన్నతస్థాయికి మోదీ తీసుకెళ్తున్నారు: లోకేశ్

ABN , Publish Date - Oct 07 , 2026 | 01:59 PM

గుజరాత్ నుంచి న్యూఢిల్లీ వరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రయాణం దూరదృష్టి, నిర్ణయాత్మక నాయకత్వం, భారతదేశ అభివృద్ధికి నిశ్చలమైన నిబద్ధతతో సాగిందని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు.

 భారత్‌ను మరింత ఉన్నతస్థాయికి మోదీ తీసుకెళ్తున్నారు: లోకేశ్
AP Minister Nara Lokesh

అమరావతి, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): గుజరాత్ నుంచి న్యూఢిల్లీ వరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రయాణం దూరదృష్టి, నిర్ణయాత్మక నాయకత్వం, భారతదేశ అభివృద్ధికి నిశ్చలమైన నిబద్ధతతో సాగిందని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (AP Minister Nara Lokesh) వ్యాఖ్యానించారు. మోదీ పాలనా ప్రస్థానంపై లోకేశ్ ప్రశంసలు కురిపించారు. ఆయన నాయకత్వంలో మన దేశం మరింత నమ్మకంతో, అధిగమించాలనే ఆకాంక్షతో, ప్రపంచ వేదికపై మరింత గౌరవప్రదంగా ఎదుగుతుండటాన్ని ఒక తరం భారతీయులు చూశారని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా మంత్రి లోకేశ్ పోస్టు పెట్టారు.


మోదీ భారత్‌కు మరిన్ని సంవత్సరాల పాటు సేవ చేయాలి..

మనం #ViksitBharat2047 దిశగా పనిచేస్తున్న తరుణంలో, పెద్దగా ఆలోచించే, చిన్న చిన్న విషయాలపై కూడా దృష్టి సారించే, భారీ స్థాయిలో పనులను అమలు చేసే మోదీ సామర్థ్యం ప్రజాజీవితంలోని మనందరికీ నిరంతరం స్పూర్తినిస్తూనే ఉంటుందని మంత్రి లోకేశ్ ఉద్ఘాటించారు. ఈ అద్భుతమైన మైలురాయిని పూర్తి చేసినందుకు అభినందనలు తెలిపారు. మోదీ భారత్‌కు మరిన్ని సంవత్సరాల పాటు సేవ చేయాలని ఆశించారు. గుజరాత్ నుంచి న్యూఢిల్లీ వరకు ఆయన ప్రయాణం దూరదృష్టి, నిర్ణయాత్మక నాయకత్వానికి నిదర్శనమని ప్రశంసించారు.


మోదీ శైలి అందరికీ స్ఫూర్తిదాయకం..

మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచ వేదికపై మరింత ఆత్మవిశ్వాసం, అత్యున్నత గౌరవాన్ని సాధించిందని మంత్రి లోకేశ్ కొనియాడారు. 'వికసిత భారత్ 2047' దిశగా పయనిస్తున్న వేళ, పెద్దగా ఆలోచించి సమర్థవంతంగా అమలు చేసే మోదీ శైలి అందరికీ స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. పాలనా ప్రస్థానంలో కీలక మైలురాయిని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని మోదీకి మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అమరావతి పనుల్లో వేగం పెంచాలి.. ప్రతి నెల రూ. 2వేల కోట్ల పనులు పూర్తి చేయాలి: సీఎం

టీటీడీ భక్తులకు అలర్ట్.. ఆ రోజుల్లో VIP దర్శనాలు రద్దు

‘స్త్రీశక్తి’ 100 కోట్లకు పైగా ప్రయాణాలు పూర్తి చేసుకోవడం గర్వకారణం: సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Oct 07 , 2026 | 02:32 PM