ఏపీ పరిషత్ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం.. కొనసాగుతున్న కౌంటింగ్
ABN , Publish Date - Nov 08 , 2026 | 09:10 AM
ఏపీ పరిషత్ ఎన్నికల్లో కూటమి హవా కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల్లో కూటమి పార్టీల అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. ఆదివారం ఉదయం 8 గంటల వరకు వచ్చిన ఫలితాలు ఇలా ఉన్నాయి.
అమరావతి, నవంబరు 8(ఆంధ్రజ్యోతి): ఏపీ పరిషత్ ఎన్నికల్లో కూటమి హవా కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల్లో కూటమి పార్టీల అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. ఈరోజు (ఆదివారం) ఉదయం 8 గంటల వరకు వచ్చిన ఎన్నికల ఫలితాలు ఇలా ఉన్నాయి. మొత్తం జడ్పీటీసీ స్థానాల్లో కూటమి 553 స్థానాలను కైవసం చేసుకుంది. మరో 19 స్థానాల్లో కూటమి అభ్యర్థులు అధిక్యంలో ఉన్నారు.
తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమికి స్పష్టమైన ఆధిక్యం కనపరుస్తోంది. ఎంపీటీసీ స్థానాల్లో ఇప్పటివరకు 7,344 స్థానాలు కూటమి పార్టీల ఖాతాలో చేరాయి. ఇందులో టీడీపీ - 6,766, జనసేన - 966, బీజేపీ - 184 స్థానాల్లో అభ్యర్థులు విజయం సాధించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ -72 జడ్పీటీసీ స్థానాలను గెలుచుకుని.. మరో 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఎంపీటీసీ స్థానాల్లో వైసీపీ ఇప్పటివరకు - 1,650 స్థానాలను గెలుచుకుంది. ఇతరులు, స్వతంత్ర అభ్యర్థులు - 7 జడ్పీటీసీ, ఎంపీటీసీ -278 స్థానాల్లో విజయం సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా కౌంటింగ్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
నవంబరు 9 నాటికి పంట నష్టం అంచనాలు పూర్తి చేయాలి.. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం
ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన సీఎంలు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి
జగన్ చొక్కామడతా పెడతామంటే భయపడే పరిస్థితుల్లో ప్రజలు లేరు: పల్లా శ్రీనివాసరావు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News