Share News

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ ఉల్లంఘనలపై ఈసీకి టీడీపీ ఫిర్యాదు

ABN , Publish Date - Nov 07 , 2026 | 08:33 PM

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ నేతలు పాల్పడుతన్న ఉల్లంఘనలపై ఏపీ ఎన్నికల కమిషన్‌కు తాము ఫిర్యాదు చేశామని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ వర్ల రామయ్య పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు లేళ్ల అప్పిరెడ్డిని బయటకు రానివ్వకూడదని, పీడీ యాక్ట్ కింద ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ ఉల్లంఘనలపై ఈసీకి టీడీపీ ఫిర్యాదు
TDP Leader Varla Ramaiah

అమరావతి, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ నేతలు పాల్పడుతన్న ఉల్లంఘనలపై ఏపీ ఎన్నికల కమిషన్‌కు తాము ఫిర్యాదు చేశామని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ వర్ల రామయ్య (TDP Leader Varla Ramaiah) పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు లేళ్ల అప్పిరెడ్డిని బయటకు రానివ్వకూడదని, పీడీ యాక్ట్ కింద ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు (శనివారం) అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో మీడియాతో వర్లరామయ్య మాట్లాడారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమాయకుడని చెబుతున్న లేళ్ల అప్పిరెడ్డి అనే వ్యక్తి బయట ఉంటే ప్రజాశాంతికి భంగం కలుగుతుందని, లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తాయని తెలిపారు. బ్యాలెట్ బాక్స్‌ను పట్టుకుని నేల మీద కూర్చోవడం, పోలీస్ అధికారి చొక్కా పట్టుకోవడం దారుణమని ధ్వజమెత్తారు.


జగన్ అలా అనడం నైతిక విలువలకే విరుద్ధం..

ఇంత చరిత్ర ఉన్న ఒక మాజీ రౌడీషీటర్‌ను చూసి జగన్ అమాయకుడనడం ఎంతవరకు సమంజసం? అని వర్లరామయ్య ప్రశ్నించారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, రోజా లాంటి వాళ్లు అతన్ని అమాయకుడంటే అనొచ్చు కానీ, జగన్ అలా అనడం నైతిక విలువలకే విరుద్ధమని మండిపడ్డారు. ఆధారాలతో ఉన్న ఫొటోలను చూసి ఎలక్షన్ కమిషన్ కూడా ఆశ్చర్యపోయిందని అన్నారు. ఈ ఘటనలు అన్నింటిపై సమగ్ర విచారణ జరిపి చట్టబద్ధమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఈసీని కోరామని అన్నారు. జగన్ రెడ్డికి నిద్రపట్టడం లేదని, తమను కూడా నిద్రపోనివ్వకుండా ప్రతిరోజూ ఎలక్షన్ కమిషన్ చుట్టూ తిప్పుతున్నారని ఆగ్రహించారు. 2024 ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితం చేసి జగన్‌ను ప్రజలు తిరస్కరించారని తెలిపారు. 2026 స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఓటర్లు అదే ఉత్సాహంతో జగన్‌కు వ్యతిరేకంగా ఉన్నారని తేలిపోయిందని పేర్కొన్నారు.


జగన్ కుట్రలు, దురాలోచనలు చేస్తున్నారు..

తమకు ప్రజామద్దతు లేదనే బండారం బయటపడుతుందనే భయంతో, ఎన్నికల ప్రక్రియను ఆపాలని జగన్ కుట్రలు, దురాలోచనలు చేస్తున్నారని వర్ల రామయ్య దుయ్యబట్టారు. లేళ్ల అప్పిరెడ్డి అమాయకుడా అని జగన్‌కి సూటి ప్రశ్న వేశారు. గతంలో గుంటూరు జిల్లాలో కనిపిస్తే కాల్చిపారేస్తానని అప్పటి ఎస్పీ హెచ్చరించిన రౌడీషీటర్ అప్పిరెడ్డి అని ప్రస్తావించారు. పోలీసుల రిమాండ్ రిపోర్టు ప్రకారం 2018 నుంచి అప్పిరెడ్డిపై 19 కేసులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. అప్పిరెడ్డి నేరాలు చేయడం అలవాటుగా మార్చుకున్న వ్యక్తి అని మండిపడ్డారు. బ్యాలెట్ బాక్స్ వద్ద పోలింగ్ అధికారి భూపేశ్ కుమార్ రెడ్డితో పాటు మాజీ రౌడీషీటర్ అప్పిరెడ్డి ఉన్న ఫొటోను ఆధారంగా చూపామని చెప్పారు. పోలింగ్ అధికారులపై వైసీపీ మూకలు దాడి, దౌర్జన్యాలు చేస్తున్న పోలీసులు ఎందుకు ఊరుకుంటున్నారని వర్ల రామయ్య ప్రశ్నించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తుఫాన్ బాధితులకు అండగా ఉంటాం.. అధైర్యపడొద్దు: సీఎం చంద్రబాబు

ఏపీ విపత్తు నిర్వహణ భేష్.. ప్రభుత్వ పనితీరుపై కేంద్రం ప్రశంసలు

పదే పదే అవమానించడంతోనే వైసీపీ నుంచి బయటకు వచ్చా: విజయసాయిరెడ్డి

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 07 , 2026 | 08:41 PM