Share News

ఏపీ విపత్తు నిర్వహణ భేష్.. ప్రభుత్వ పనితీరుపై కేంద్రం ప్రశంసలు

ABN , Publish Date - Nov 06 , 2026 | 04:52 PM

'అర్నబ్', 'మురసు' జంట తుఫాన్‌ల విపత్తు నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కార్ సేవలు భేష్‌గా నిలిచాయని కేంద్ర బృందం ప్రశంసలు కురిపించింది. తుఫాన్‌లపై సకాలంలో బాధితులకు అందించిన సేవలకు గానూ రాష్ట్ర ప్రభుత్వ తీరును కేంద్ర బృందం అభినందించింది.

ఏపీ విపత్తు నిర్వహణ భేష్.. ప్రభుత్వ పనితీరుపై కేంద్రం ప్రశంసలు
AP Government

అమరావతి, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): 'అర్నబ్', 'మురసు' జంట తుఫాన్‌ల విపత్తు నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కార్ సేవలు భేష్‌గా నిలిచాయని కేంద్ర బృందం ప్రశంసలు కురిపించింది. తుఫాన్‌లపై సకాలంలో బాధితులకు అందించిన సేవలకు గానూ రాష్ట్ర ప్రభుత్వ తీరును కేంద్ర బృందం అభినందించింది. అయితే, 'అర్నబ్', 'మురసు' జంట తుఫాన్‌లు ఒకే వారంలో విరుచుకుపడటంతో 20 జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపించాయి. 120 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు.. ప్రకృతి బీభత్సాన్ని దీటుగా ఏపీ ప్రభుత్వం ఎదుర్కొంది.


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనికత, ముందస్తు వ్యూహాలతో పెనుముప్పు తప్పింది.. ఆపదలో రాష్ట్రాన్ని సురక్షిత నాయకత్వం ఆదుకుంది. విపత్తు నిర్వహణలో దేశానికే ఆదర్శంగా ఏపీ నిలించింది. తుఫాన్‌ల ప్రభావంతో కనిష్ఠ స్థాయికి ఆస్తి, ప్రాణనష్టం వచ్చింది. ప్రాణ రక్షణ కవచాళ్లాగా రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA), ఆర్టీజీఎస్ అధికారులు (RTGS) పనిచేశారు. కంట్రోల్ రూమ్ నుంచి 24/7 తుఫాన్‌ల పర్యవేక్షణ.. కచ్చితమైన అంచనాలతో యంత్రాంగం అప్రమత్తమైంది.


ఏఐ, శాటిలైట్ సమాచారంతో ఫోన్లకు హెచ్చరికలను ఏపీ సర్కార్ జారీ చేసింది. 'మనమిత్ర' వాట్సాప్ యాప్‌తో సత్వర సహాయం అందజేసింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీసు శాఖల సమన్వయం ద్వారా లక్షలాది మంది సురక్షిత ప్రాంతాలకు తరలించింది. పునరావాస కేంద్రాల్లో బాధితులకు సర్కార్ అండగా నిలిచింది. నిరంతరాయంగా ఆహారం, తాగునీరు, వైద్యం అందజేసింది. రికార్డు వ్యవధిలో రాకపోకలను పునరుద్ధరించింది. అధికారుల సమష్టి కృషితో వేగంగా సాధారణ స్థితికి జనజీవనం వచ్చింది.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం చంద్రబాబు కేసులపై హైకోర్టులో కీలక విచారణ

ప్రాణాలకు తెగించి పోలీసుల రెస్క్యూ ఆపరేషన్.. హోం మంత్రి అనిత ప్రశంసలు

కడప, పులివెందులలో జగన్ అరాచకాలు, దౌర్జన్యాలతో ఓటర్లను భయపెడుతున్నారు.. పల్లా శ్రీనివాసరావు ధ్వజం

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 06 , 2026 | 05:57 PM