ప్రాణాలకు తెగించి పోలీసుల రెస్క్యూ ఆపరేషన్.. హోం మంత్రి అనిత ప్రశంసలు
ABN , Publish Date - Nov 05 , 2026 | 06:21 PM
గుంటూరు జిల్లా చిలకలూరిపేట పరిధిలోని తిమ్మాపురం అండర్‌పాస్ వద్ద నిన్న వరదలో చిక్కుకున్న మహిళలను పోలీసులు కాపాడారు. ఈ సందర్భంగా పోలీసులను ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత ప్రశంసించారు.
అమరావతి, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): గుంటూరు జిల్లా చిలకలూరిపేట పరిధిలోని తిమ్మాపురం అండర్‌పాస్ వద్ద నిన్న(బుధవారం) వరదలో చిక్కుకున్న మహిళలను పోలీసులు కాపాడారు. ఈ సందర్భంగా పోలీసులను ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత (AP Home Minister Anita) ప్రశంసించారు.
అయితే, తిమ్మాపురం అండర్‌పాస్ వద్ద ముగ్గురు మహిళలు వరద ప్రవాహంలో చిక్కుకున్నట్లు సమాచారం అందుకున్నచిలకలూరిపేట రూరల్ సీఐ బి. సుబ్బనాయుడు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రాణాలకు తెగించి మహిళలను సీఐ రక్షించారు.
నడుముకు తాడు కట్టుకుని ఉధృతంగా పారుతున్న వరదలోకి సీఐ దూకారు. సిబ్బంది సహకారంతో ముగ్గురు మహిళలను సురక్షితంగా ఒడ్డుకు పోలీసులు చేర్చారు. పోలీసుల సాహసోపేత చర్యపై హోంమంత్రి అనిత ప్రశంసలు కురిపించారు. విధి నిర్వహణలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా మహిళలను కాపాడిన పోలీసులకు అభినందనలు తెలిపారు. పోలీసుల ధైర్యసాహసాలు సమాజానికి స్ఫూర్తిదాయకమని హోంమంత్రి అనిత కొనియాడారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నాంది ఫౌండేషన్ 28 ఏళ్ల ప్రస్థానం.. ఆనంద్ మహీంద్రాకు చంద్రబాబు థ్యాంక్స్
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు పటిష్ఠ ప్రణాళిక: ఏపీ ఎస్‌ఈసీ
ఏలూరు జిల్లాలో వరదలు.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News